Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఎవ్వరి మాటా వినరు, ఆయనంతే.. అదోటైపు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:46 IST)
బిగ్ బాస్ 4 నుండి కుమార్ సాయ్ ఎలా ఎలిమినేట్ అయ్యారు చూద్దాం. బిగ్ బాస్ 4లో మొదటిసారిగా ఈ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ హౌస్‌లో చాలా తక్కువ ఓటింగ్ సంపాదించిన మహిళా కంటెస్టంట్‌గా మోనల్ గజ్జర్ తరవాత స్థానంలో కుమార్ సాయి ఉన్నారు. గత వారంలో కుమార్ సాయి తన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు.
 
కానీ ప్రస్తుతం తనకు తక్కువ ఓటింగ్ రావడంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయారు. ప్రారంభంలో కుమార్ సాయి చురుకుగా తమ టాలెంట్‌ను ప్రదర్శించినా ఈ వారం కాస్త ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ప్రేక్షకుల మధ్య ఆదరణ కొరవడింది. కానీ మోనల్ గజ్జర్ ఈ హౌస్‌లో చాలా సున్నితంగా తమ పాత్రను ప్రదర్శించినా తన హావభావాలతో ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే విధంగా ప్రదర్శించారు.
 
కానీ చాలా తక్కువ స్థాయిలో ఓటింగ్ పొందిన కుమార్ సాయి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడ్డారు. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ప్రతి వారం తక్కువ ఓటింగ్ పొందే వారిని హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తారు. అందులో కుమార్ సాయికి ఈ వారం ప్రేక్షకుల ఆదరణ కొరవడటంతో తక్కువ ఓటింగ్ పొంది హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఐతే ఈ ఓటింగ్ పైన ప్రేక్షకులు కొందరు నమ్మకాన్ని వ్యక్తం చేయడంలేదు. ఐతే బిగ్ బాస్ చేసుకుంటూ వెళ్లడమే కానీ ఎవ్వరి మాటా వినరు కదా. ఆయనంతే అదోటైపు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments