దసరా పర్వదినం సందర్భంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఓ కంటెస్టెంటె వెళ్లిపోయారు. బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం 50వ ఎపిసోడ్ పూర్తి చేసుకోగా, ఆదివారం ఎపిసోడ్‌లో ఎన్నో స్పెషల్ సర్‌ప్రైజెస్ ఉన్నాయి.
ప్రధాన హోస్ట్ అక్కినేని నాగార్జున గైర్హాజరీతో ఆయన కోడలు, హీరోయిన్ సమంత అక్కినేని హోస్ట్ చేయడం, అఖిల్ అండ్ టీం తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్‌పైకి రావడం, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం హైపర్ ఆది ఎప్పటిలాగా నవ్వించడం అంతా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
అయితే పండగ రోజు ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులని నవ్వించేందుకు డిటెక్టివ్‌గా హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజ్‌పై అడుగపెట్టాడు. వచ్చీ రావడంతోనే పాయల్‌పై పంచ్ వేశాడు. ఇక్కడ పాయల్, లోపల మోనాల్‌కు తెలుగు రాదు అంటూ నవ్వించాడు.
ఇక ఇంటి సభ్యులతో మాట్లాడిన హైపర్ ఆది ఒక్కో కంటెస్టెంట్‌పై తనదైన పంచ్‌లు వేస్తూ తెగ నవ్వించాడు. అమ్మ రాజశేఖర్‌ను అపరిచితుడు అని, అర్జున్ రెడ్డిలా ఉన్న సోహైల్ ఇప్పుడు స్వాతిముత్యంలా మారాడని, మోనాల్‌ను చూస్తుంటే తన సొంత క్రష్‌లా అనిపిస్తుందని ఇలా అందరి గురించి కామెడీగా చెబుతూ ఎంటర్‌టైన్ చేశాడు.
దివికి నీ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వు అని సమంత.. కార్తికేయకు రికమెండ్ చేయగా తాను ఓకె అన్నాడు. అలానే కార్తికేయ పనిపనిలో తనతో ఓ సినిమా చేయాలని సమంతని రిక్వెస్ట్ చేశాడు. దీనికి సమంత ఓకే చెప్పడంతో తెగ సంతోషించాడు. ఇక దివి వెళ్లే ముందు బిగ్ బాంబ్ లాస్యపై వేసింది. ఈ బిగ్ బాంబ్ ప్రకారం వారం మొత్తం అభిజిత్ సాయంతో లాస్య వంట చేయాల్సి ఉంటుంది.
మొత్తానికి పండగ రోజు మూడు గంటల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన సమంత అందరికి బైబై చెప్పి తన మామలానే మీ ఇంటితో పాటు బిగ్ బాస్ ఇంటిపై ఓ కన్నేసి ఉంచండి అంటూ విజయదశమి స్పెషల్ ఎపిసోడ్‌కి గుడ్ బై చెప్పేసింది.