Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నాలుగో సీజన్.. నో ఎవిక్షన్ కార్డ్ గేమ్.. అఖిల్‌ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ..?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (11:45 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయని నాగార్జున గతవారం వెల్లడించారు. ఫినాలే వీక్ తీసేస్తే ఇక మిగిలింది మూడు వారాలు. అయితే హౌజ్‌లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. అవినాష్, అభిజీత్, అఖిల్, అరియానా, సోహైల్, మోనాల్, హారికలు హౌజ్‌లో ఉండగా ఈ వారం నామినేషన్స్‌లో మోనాల్, అఖిల్, అవినాష్, అరియానాలు ఉన్నారు.
 
మరి మిగిలి ఉన్న మూడు వారాలకు ఇద్దరే హౌజ్‌లో నుండి వెళ్లనున్నారు. ఎందుకంటే ఫైనల్స్ ఆడేది ఐదుగురు. మరి ఈ నేపథ్యంలో ఒక వారం ఎలిమినేషన్ ఫ్రీ అయినా ఉండాలి, లేదా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రీ-ఎంట్రీ అయినా జరగాలి. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయట నుండి హౌజ్‌లోకి రావడం కన్నా నో ఎలిమినేషన్ పెట్టడమే బెస్ట్ అని నిర్వాహకులు సైతం భావిస్తున్నారు.
 
అందుకే ముందు జాగ్రత్తగా నో ఎవిక్షన్ కార్డు గేమ్ ఆడించారు. అవినాష్ అది గెలుచుకోగా దాన్ని వాడుకుని ఈ వారం హౌజ్ నుండి సేవ్ అవ్వనున్నాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది. మిగిలి ఉన్న రెండు వారాలకు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.
 
బిగ్‌బాస్‌లో చాలా రోజుల తరువాత అఖిల్‌, మోనాల్‌ మనసు విప్పి మాట్లాడుకున్నారు. గేమ్ గేమ్‌లా ఆడుదామని మోనాల్‌ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావు అని అఖిల్‌ అన్నాడు. ఇక అఖిల్ దగ్గర ప్రామిస్ తీసుకున్న మోనాల్‌.. సొహైల్‌ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. సొహైల్‌ చాలా తెలివిగా గేమ్‌ ఆడుతున్నాడని, ఎవరితో ఎలా మాట్లాడితో మంచి పేరు వస్తుందో అలా మాట్లాడుతాడు అని చెప్పింది. 
 
అయితే ఆ విషయాలను అఖిల్‌ లైట్‌గా తీసుకున్నాడు. వాడు గేమ్‌ ఎలాగైనా ఆడని, కానీ నాతో మంచిగా ఉంటున్నాడు. నాకు వాడితో మంచి రిలేషన్ ఉంది. మా ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే డైరెక్ట్‌గా వెళ్లి అడిగే చనువు ఉంది అని చెప్పుకొచ్చాడు.
 
దీని తరువాత అఖిల్‌ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించాడు. ఏమైందో.. ఎందుకో చెప్పలేదు కానీ.. ఎలిమినేషనల్ భయంతో ఏడుస్తున్నట్లుగా అనిపించింది. ఇక అరియానా, అవినాష్, సొహైల్‌లు వచ్చి అఖిల్‌ని ఓదార్చారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments