Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఇంట్లో బాబు గోగినేని... అరెస్ట్ ఎలా చేయాలో ఆలోచిస్తున్న పోలీసులు

తెలుగు బిగ్‌బాస్ షోకు, పోలీసులకు మంచి అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. సీజన్ 1లో ముమైత్ ఖాన్‌ను విచారణ కోసం తీసుకెళ్లగా, సీజన్ 2లో బాబు గోగినేనికి ఆ అవకాశం వచ్చినట్లుంది. అయితే ఈసారి విచారణ కోసం తీసుకెళ్తారా లేదా అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తారా అనే విషయం

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (14:34 IST)
తెలుగు బిగ్‌బాస్ షోకు, పోలీసులకు మంచి అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. సీజన్ 1లో ముమైత్ ఖాన్‌ను విచారణ కోసం తీసుకెళ్లగా, సీజన్ 2లో బాబు గోగినేనికి ఆ అవకాశం వచ్చినట్లుంది. అయితే ఈసారి విచారణ కోసం తీసుకెళ్తారా లేదా అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తారా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు.
 
వివరాల్లోకి వెళితే, బాబు గోగినేనిపై వీర నారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. మత విశ్వాసాలను కించపరచడం, భారత విదేశాంగ విధానానికి ఆటంకం కలిగించేలా విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేయడం, గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ సమాచారాన్ని ఇతర మార్గాల ద్వారా విదేశాలకు అందజేయడం, దేశ భద్రతకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించడం వంటి ఆరోపణలతో గత నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
బాబు గోగినేని ఫౌండర్‌గా ఉన్న సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన కార్యక్రమాలను మలేసియాలో నిర్వహిస్తారని, దీని కోసం హేతువాద సమావేశాలను ఏర్పాటు చేసి సభ్యులకు ఆహ్వానం పలికి తప్పనిసరిగా వారి ఆధార్ నంబర్‌ను ఆయన బృంద సభ్యులు తీసుకుంటారని, ఆ ఆధార్ నంబర్‌లను వెబ్‌సైట్‌లలో బహిర్గతం చేయడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను ఆయన బృందం హరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ హైకోర్టు ఆదేశాల మేరకు బిగ్‌బాస్ షోలో ఉన్న బాబు గోగినేనిని బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో తీసుకొస్తామని చెప్పారు. అయితే విచారించడానికా లేదా అరెస్ట్ చేయడానికా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే కేసు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments