Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు సునయన స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోలేదా? బిగ్ బాస్ రచ్చ

11 వారాలు గడిచినా కంటెస్టెంట్స్ రూల్స్ ఫాలో కావడం లేదని దీప్తిని బిగ్ బాస్ కెప్టెన్ పదవి నుండి తప్పించాడు. ఈ విషయంగా కౌషల్ మాట్లాడుతూ ఈ ఎఫెక్ట్ హౌస్‌‌లో ఉన్న అందరిపై పడుతుందని, కనుక అలా చేయవద్దని చెప్పగా కోపంతో తనీష్ "అసలు ప్రతిదానికి అలా చేయాలి, ఇలా

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (17:36 IST)
11 వారాలు గడిచినా కంటెస్టెంట్స్ రూల్స్ ఫాలో కావడం లేదని దీప్తిని బిగ్ బాస్ కెప్టెన్ పదవి నుండి తప్పించాడు. ఈ విషయంగా కౌషల్ మాట్లాడుతూ ఈ ఎఫెక్ట్ హౌస్‌‌లో ఉన్న అందరిపై పడుతుందని, కనుక అలా చేయవద్దని చెప్పగా కోపంతో తనీష్ "అసలు ప్రతిదానికి అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పడానికి నువ్ ఎవరివి? అందరూ నీలాగే ఉండాలంటే కుదరదు. ఎవరైనా తప్పుచేస్తే వాళ్లు శిక్ష అనుభవిస్తారు నీకొచ్చిన నొప్పి ఏంటి" అంటూ కౌశల్‌పై ఫైర్ అయ్యాడు.
 
ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. నువ్వు, సునయన స్టోర్ రూంలోకి వెళ్లి పడుకోలేదా అని కౌశల్ అనడంతో మరింత కోపంతో కౌశల్‌పై దూసుకొచ్చాడు. ఇక అగ్నికి ఆజ్యం పోసినట్లు గీతా మాధురి, సామ్రాట్, రోల్‌లు కూడా సపోర్ట్‌ చేయడంతో మరికాస్త రెచ్చిపోయాడు తనీష్. ఆదివారం ఎపిసోడ్లో రాఖీ పండుగల సందర్భంగా నాని ఇంట్లోకి వెళ్లి అందరితో రాఖీ కట్టించుకుని గిఫ్ట్స్ అందించాడు. హౌస్‌లో ఒక్కొక్కరినీ ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గొడవపై తనీష్, కౌశల్‌లను వివరణ కోరాడు.
 
తనీష్‌తో నోరు తగ్గించుకోమని, అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చాడు నాని. అయితే కౌషల్‌తో కూడా బిగ్ బాస్ రూల్స్ ముందు నుండి ఇలాగే ఉన్నాయని, వాటిలో మార్పు లేదని, కనుక నువ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ నీలాగే ఆడాలంటే కుదరదు. ఎవరి ఆట వాళ్లు ఆడితే ఎలాంటి గొడవలు ఉండవని చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments