Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ స్టేజీపై కింగ్ నాగార్జున... మగాళ్లతో నావల్ల కాదు

బిగ్ బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. షోను మరింత వినోదభరితంగా మార్చడానికి ఎన్నివిధాలు ఉన్నాయో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. నిన్నటి ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజీపైకి ఎక్కారు. నాని, నాగార్జున కలిసి నటించిన

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (10:32 IST)
బిగ్ బాస్ సీజన్ 2 ముగియడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. షోను మరింత వినోదభరితంగా మార్చడానికి ఎన్నివిధాలు ఉన్నాయో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. నిన్నటి ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజీపైకి ఎక్కారు. నాని, నాగార్జున కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’ ఈ నెల 27న విడుల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా దేవ్ నాగార్జున గన్ పట్టుకుని వచ్చాడు. 
 
ఇక దాస్‌గా నాని నటిస్తుండగా దేవ్ వచ్చిన వెంటనే ‘మీ అందరిలో ఎవరో మా దాస్‌ని ఇబ్బందిపెడుతున్నారట. ఈ గన్‌లో కరెక్ట్‌గా ఆరు బుల్లెట్స్ ఉన్నాయ్ దించేస్తా జాగ్రత్త’ అని బెదిరించాడు. ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారని నాగ్ కంటెస్టెంట్స్‌ని అడిగగా, 106 రోజులు నుండి అని చెప్పడంతో ‘ఏమైనా పోయేకాలం వచ్చిందా మీకు’ అని అనడం, దేవదాస్ ట్రైలర్‌లో పెగ్గుల మీద పెగ్గులు లాగించేశారని కౌశల్ అంటే.. మీకు బిగ్ బాస్ హౌస్‌లో పెగ్‌లు ఇవ్వడం లేదా? అది మీ ఖర్మ అంటూ కామెడీ చేసాడు. 
 
హీరోయిన్స్ చాలా అందంగా ఉన్నారు మీ సినిమాలో అని కౌశల్ అంటే.. ఏమన్నావ్ అంటూ గన్ పట్టుకుని సీరియస్‌గా కౌశల్ వైపు వెళ్లి బెదిరించడం చాలా ఫన్నీగా అనిపించింది. నేనైతే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండే వాడిని కాదు.. నాతో పాటు మిగిలిన ఐదుగురు ఆడవాళ్లు ఉండి ఉంటే ఉండేవాడినేమో. కాని మగాళ్లతో నాకు కష్టం అని చురకలు అంటించారు మన మన్మథుడు. 
 
ఇక నానితో ఏంటి బిగ్ బాస్ స్టేజ్‌పై మీద కలరింగే లేదా? అనడంతో నాకసలు ఇక్కడ కలర్ లేదు దేవా అనడంతో, ఉండు నేను పంపిస్తా అని చెప్పి దేవ్‌దాస్ హీరోయిన్స్‌ ఆకాంక్ష సింగ్, రష్మికా మందనలు బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. మొత్తానికి ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉంది. మరి చివరి వారం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments