Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బిచ్చగాడు'' రూ.25 కోట్ల సూపర్ కలెక్షన్స్ : 200 థియేటర్లలో 75 రోజులు దాటేశాడు!

''బిచ్చగాడు'' అనువాదకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటిదాకా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది.

Webdunia
గురువారం, 28 జులై 2016 (11:24 IST)
''బిచ్చగాడు'' అనువాదకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇప్పటిదాకా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. బిచ్చగాడు రిలీజైనప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అనువాద సినిమా కావడంతో పాటు సినిమాలోని నటీనటులెవ్వరూ తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోవడంతో ఈ సినిమాకు ఆదరణ లభించలేదు. అయితే బిచ్చగాడిని లైట్‌గా తీసుకున్న వారంతా రోజులు గడిచేకొద్దీ బిచ్చగాడికి విలువ ఇవ్వడం మొదలెట్టేశారు. 
 
కేవలం మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ఇప్పటిదాకా రూ.25కోట్లకు పైగా వసూలు చేసింది. అనువాద సినిమాలు ఇంత మొత్తం వసూలు చేయడం దక్షిణాదిన మొదటి సారి అని సినీ జనం అనుకుంటున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయిలో రూ.30 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు ఇప్పటికే 75 రోజులు కూడా దాటేసింది. 75 రోజులంటే ఐదో పదో థియేటర్లలో కాదు.. మొత్తం 200 థియేటర్లలో 75 రోజులు దాటేసిందంటే సామాన్యమైన విషయం కాదు. ఏ స్టార్‌కీ తీసిపోని రీతిలో సుమారు 200 థియేటర్లలో 75 రోజులు బిచ్చగాడు పూర్తి చేసుకుంది.
 
తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ ఆంటోని, సత్న టైటస్‌ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ తిరుపతిరావు సమర్పణలో మే 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 
భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్నో సినిమాలు ఓ పక్క ప్రేక్షకులను నిరాశ పరుస్తుంటే, ఏ అంచనా లేని బిచ్చగాడు ఈ రేంజ్ హిట్ కొట్టడం మాటలు కాదు. బ్రహ్మోత్సవం, అ..ఆ.., సర్దార్, కబాలి వంటి పెద్ద సినిమాల ధాటిని తట్టుకుని, తనకంటూ ఓ ఇమేజ్‌ను బిచ్చగాడు ఏర్పరుచుకున్నాడు. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడాని బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments