Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికకు భర్తతో గొడవలు మొదలయ్యాయా? విడాకులు తీసుకుంటుందా?

Webdunia
సోమవారం, 23 మే 2016 (13:09 IST)
సినీ ఇండస్ట్రీలో పెళ్ళిళ్లు, విడాకులు సర్వసాధారణమైపోయాయి. హీరోయిన్లు దర్శకులను లేదా పారిశ్రామిక వేత్తల్ని పెళ్లాడే సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే కోవలో మిస్సమ్మ హీరోయిన్ భూమికకు కూడా భర్త నుంచి కష్టాలు మొదలయ్యాయి. దీంతో భూమిక తన భర్త నుంచి దూరం కావాలనుకుంటుంది. అయితే ఇదంతా నిజం అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. భర్తకు భూమిక దూరం కావడం రీల్ లైఫ్‌లో.. రియల్ లైఫ్‌లో కాదు. 
 
టాలీవుడ్‌కి దూరంగా ఉన్న భూమిక.. గత ఏడాది ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో శాండిల్‌వుడ్‌లో వచ్చిన ఐ లవ్ అలియా అనే సినిమాను అదే పేరుతో హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో భూమిక కూడా నటిస్తోంది. ఆమె పేరు కూడా భూమి. ఈమె ఓ డాన్స్ టీచర్. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తతో నిత్యం గొడవలు మొదలవుతాయి. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటుందట. 
 
భూమికకు భర్తగా రవిచంద్రన్ కనిపించనున్నాడు. మిగతా క్యారెక్టర్స్‌లో సన్నీలియోన్, చంద్రన్‌కుమార్, సంగీత చౌహాన్, షాయాజి షిండే కనిపిస్తారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో భూమిక మంచి గుర్తింపు వస్తుందని, సెకండ్ ఇన్నింగ్స్‌కు ఢోకా లేదనుకుంటుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం