Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భరత్ అను నేను'... గంటన్నరలో 60 వేల వ్యూస్, 10 వేల కామెంట్లు(వీడియో)

శ్రీమంతుడు చిత్రంతో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు కొట్టేసిన ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంపై మొదట్నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో ముఖ్యమంత్రిగా మహేష్ బా

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (19:49 IST)
శ్రీమంతుడు చిత్రంతో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు కొట్టేసిన ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రంపై మొదట్నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనిపించనున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం నుంచి 'ది విజన్ ఆఫ్ భరత్' అంటూ వీడియో విడుదలయింది. ఇందుల్లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా వున్నాయి. "చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. 
 
ఒకసారి ప్రామిస్ చేసి మాట తప్పొద్దని, ఎప్పటికీ ఆ మాట తప్పలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది. చాలా కష్టమైంది. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్లకి భయం, బాధ్యత ఉండాలి" అంటూ మహేష్ బాబు డైలాగ్స్ చెపుతూ చేస్తున్న యాక్షన్ అదరగొట్టేసింది. మహేష్ బాబు చాలా హ్యాండ్‌సమ్‌గా వున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కైరా అద్వాని నటిస్తోంది. దానయ్య నిర్మాతగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా చిత్రాన్ని ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేయనున్నారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్!!

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments