Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌కి 10, జూనియర్ ఎన్టీఆర్‌కు 1.. ఏంటిది?

మెగాస్టార్ చిరంజీవికి పది, జూనియర్ ఎన్టీఆర్‌కి 1 అంటే ఏంటనుకుంటున్నారా.. ర్యాంకులండీ ర్యాంకులు.. ఖైదీ నం. 150 సినిమాతో తన రేంజ్ ఏమిటో టాలీవుడ్‌లో అందరికీ చూపించేసిన చిరంజీవి ఒక విషయంలో మాత్రం టాలీవుడ్ హీరోలందరికంటే తగ్గు స్థానంలో ఉన్నాడని తెలిస్తే అభ

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (06:52 IST)
మెగాస్టార్ చిరంజీవికి పది, జూనియర్ ఎన్టీఆర్‌కి 1 అంటే ఏంటనుకుంటు న్నారా.. ర్యాంకులండీ ర్యాంకులు.. ఖైదీ నం. 150 సినిమాతో తన రేంజ్ ఏమిటో టాలీవుడ్‌లో అందరికీ చూపించేసిన చిరంజీవి ఒక విషయంలో మాత్రం టాలీవుడ్ హీరోలందరికంటే తగ్గు స్థానంలో ఉన్నాడని తెలిస్తే అభిమానుల గుండెలవిసిపోతాయి. అది కూడా చిరు దేంట్లో కింది స్థానంలో ఉన్నాడో తెలిస్తే కొన్ని గుండెలు ఆగిపోతాయి కూడా. డ్యాన్స్‌లో చిరంజీవికి పదోస్థానమట. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తెలుగు చిత్రసీమలో డ్యాన్స్‌కు పర్యాయపదమైన చిరంజీవి అంత వెనుకబడటమేమిటి.. నిన్న కాక మొన్న పుట్టుకొచ్చిన బుడ్డోడు జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండటమేమిటి. అంతా ఆన్ లైన్ మాయ మరి. అదేంటే చూద్దాం మరి.
 
టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ అనే విషయంపై చాలాసార్లు హీరోల అభిమానులు వాదులాడుతుంటారు. కొందరైతే జూనియర్ ఎన్టీఆర్ టాప్ అని, మరికొందరు అల్లు అర్జున్, రామ్ చరణ్ అని హీరోలు ఎవరూ కాదు.. డ్యాన్స్ కింగ్స్ ప్రభుదేవా, లారెన్స్ అని చెబుతుంటారు. ఈ విషయాలపై ఓ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఓ ఆసక్తికర విషయం వెల్లడవుతుంది. 'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయగానే వచ్చే పేరుతో కొందరు షాక్ తినగా, ఓ హీరో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు లిస్ట్‌లో అగ్ర స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌ను, డాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా, లారెన్స్‌లను సైతం వెనక్కి నెట్టేస్తున్నాడు ఎన్టీఆర్.
 
ఈ టాప్ టెన్ జాబితాలో ముగ్గురు టాలీవుడ్ హీరోలుండగా, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పదో స్ధానంలో నిలిచారు. టాప్ డ్యాన్సర్స్ జాబితాలో మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్ ఉండటం విశేషం. 'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని గూగుల్‌లో సెర్చ్ చేయగా టాప్‌ టెన్‌ జాబితా ఇలా కనిపిస్తుంది.
1. జూనియర్ ఎన్టీఆర్
2. హృతిక్ రోషన్
3. అల్లు అర్జున్
4. ప్రభుదేవా
5. లారెన్స్
6. మాధురి దీక్షిత్
7. విజయ్(తమిళం)
8. రాఘవ్ క్రోక్‌రోజ్
9. ఐశ్వర్యరాయ్
10. చిరంజీవి
 
చూస్తుంటే చిరంజీవి అభిమానులు ఇక వీధిపోరాటాలు మాని ఆన్‌లైన్‌లో తమ అభిమాన నటుడికి అనుకూలంగా సెర్చ్ ఇంజన్‌లలో యుద్ధాలు చేయాల్సి వచ్చేటట్టుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments