Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల జర్నీ లో వైవిధ్యమైన కథలతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ - ఈసారి ఏకంగా మూడు చిత్రాలతో రాబోతున్నాడు

డీవీ
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (12:20 IST)
Bellamkonda Srinivas
టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లుడు శీను, జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోయాడు. ఈ సినిమాల్లో.. అతని నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా శ్రీనివాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి (2024) పది సంవత్సరాలు  పూర్తైంది. 
 
మొదటి నుండి శ్రీనివాస్ తన సిక్స్-ప్యాక్ బాడీతో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్‌ హీరోల లీస్ట్‌లో చేరిపోయాడు. ఇందుకు తన కఠినమైన వ్యాయామం, దినచర్యలు, తన అంకిత భావమే కారణం అని చెప్పాలి. ఫిట్‌నెస్ విషయంలో అతను చాలా నిబద్ధతతో ఉంటాడు.
 
ఇక ఈహీరో తన క్రేజ్‌ని పెంచుకోవాడనికి.. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. SS రాజమౌళి  తెరకెక్కించిన ఈ సినిమా అతనికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
 
ప్రస్తుతం శ్రీనివాస్‌..14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై వస్తున్న 'టైసన్ నాయుడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 
 
ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో  పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు‌ మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.
 
వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్‌ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా  చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేస్తాయి అని అంటున్నారు. 
 
యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.  శ్రీనివాస్‌ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్‌ బ్యాక్‌ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments