కరోనా సెకండ్ వేవ్ ఎలా వుందో తెలిసిందే. దాని ప్రభావాన్ని తట్టుకోవడానికి ప్రతిఒక్కరూ పాజిటివ్ ఆలోచనలతో వుండాలి. తగిన వ్యాయామం చేయాలంటూ... స్వీటీ అనుష్కశెట్టి సోషల్‌మీడియాలో లెటర్ పోస్ట్‌చేసింది. చాలా కాలం తర్వాత సోషల్‌మీడియా ఆమె తన స్పందన తెలియజేసింది. అయితే ఎక్కడా తన ఫొటోను పెట్టలేదు. కేవలం లెటర్‌ను మాత్రమే పెట్టింది.
Anuksha letter
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తాముగా స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరింది. ప్రతిఒక్కరికీ వారి బాధలను ఎలా వ్యక్తపరచాలో తెలియకపోవచ్చు. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి సమయంలో మనకు పాజిటివ్ ఎనర్జీ అవసరం.. దానికోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఫైనల్‌గా పాజిటివ్ థింకింగ్ రావాలంటే దేవుడ్ని తలచుకోండి అంటూ స్వీటీ తెలిపింది.