Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంలో ట్రంప్‌తో కలిసి ఫోటో దిగి తీసుకొస్తా.. నాకేమైనా పిచ్చా: బండ్లగణేష్

హాస్యనటుడిగా కెరీర్ మొదలెట్టి నిర్మాతగా మారిన వ్యక్తి బండ్ల గణేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సర్కిల్ గురించి ఎవరికీ తెలియదన్నాడు. కావాలనుకుంటే వారం రోడుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోటో ది

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (10:22 IST)
హాస్యనటుడిగా కెరీర్ మొదలెట్టి నిర్మాతగా మారిన వ్యక్తి బండ్ల గణేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సర్కిల్ గురించి ఎవరికీ తెలియదన్నాడు. కావాలనుకుంటే వారం రోడుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోటో దిగి తీసుకొస్తా.. అదీ తన స్టామినా అంటూ బండ్ల గణేష్ వెల్లడించాడు.

స్టార్ హీరోలతో సినిమాలు చేశాను.. ఎస్వీ కృష్ణారెడ్డి వల్లే తాను నటుడినయ్యానని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చెయ్యని పనిలేదని, ‘ప్లీజ్‌ ఆంటీ’ అనే అడల్ట్ సినిమాలో కూడా నటించానని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే ఓ హీరోతో జరిగిన గొడవ గురించి కూడా చెప్పాడు.
 
తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు సచిన్ జోషితో "నీజతగా నేనుండాలి" అనే సినిమా చేయడమే. తన స్నేహితుడి కోరిక మేరకు ఆ సినిమాకు చేసేందుకు ఒప్పుకున్నానని... కానీ సినిమా ఆడలేదన్నాడు. సినిమాకు డబ్బంతా అతనే పెట్టుకున్నాడు. కానీ, సినిమా ఫ్లాపవడంతో తన నుంచి డబ్బులు వసూలు చేద్దామని చూశాడు. 
 
నాకేమైనా పిచ్చా? డబ్బులు సంపాదించుకుందామనుకునేవాడెవడైనా సచిన్‌ జోషితో సినిమా చేస్తాడా? దాంతో మా మధ్య విభేదాలు పెరిగాయి. నన్ను జైల్లో పెట్టిస్తానన్నాడు. జైల్లో కలుద్దామని ట్వీట్‌ కూడా చేశాడు. నన్నెవరూ ఏమీ చేయలేరు. నా సర్కిల్‌ గురించి ఎవరికీ తెలియదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments