Webdunia - Bharat's app for daily news and videos

Install App

కష్టంతో పైకివచ్చారు.. మీ పరామర్శ కొండంత బలాన్నిచ్చింది : బండ్ల గణేష్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (10:42 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో బండ్ల గణేష్‌ ఓ ప్రత్యేకత. ఆయన నిర్మించిన చిత్రాలు చాలా తక్కువే అయినప్పటికీ... టాలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో ఒకరుగా నిలిచారు. ఈయనకు మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా, ఆ ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఆయనకు వీరాభిమాని. అలాంటి బండ్ల గణేష్... మరోమారు మెగా ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. 
 
'కష్టంతో పైకి వచ్చిన వాళ్లకి కష్టం తెలిసిన వాళ్లకి, ఏ అండా లేకుండా కొండగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకి మనసు, ప్రేమ, అనురాగం ఆప్యాయతలు ఉంటాయన్నందుకు మీరే ఉదాహరణ. యావత్ ఇండస్ట్రీ మిమ్మల్ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది. వందేళ్లు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.
 
'ఎలా ఉన్నావు అంటూ మీరు చేసిన పరామర్శ మాకు కొండంత బలం, తెలియని ఆనందం.. ఎంతో సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు అన్నగారు' అని బండ్ల గణేశ్ తెలిపారు. కాగా, బండ్ల గణేశ్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో చిరంజీవి ఫోనులో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
కానీ, తాను అమితంగా ఆరాధించే పవన్ కళ్యాణ్ మాత్రం బండ్ల గణేష్‌ను పరామర్శించలేదు. ఇదే అంశంపై బండ్ల గణేష్ వద్ద ఓ న్యూస్ యాంకర్ ప్రస్తావించగా, బహుశా ఈ విషయం ఆయనకు తెలిసివుండకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments