Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ డాన్సే కాదు.. డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేసేస్తున్నాడట..!

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2015 (10:20 IST)
నందమూరి హీరో బాలకృష్ణ డాన్స్‌లో దిట్ట.. ఈ ఏజ్‌లో కూడా యంగ్ హీరోల్లా డాన్స్‌ చేసేస్తున్నాడు. అదేవిధంగా స్టంట్స్‌కూడా చేసేస్తున్నాడు. 'డిక్టేటర్‌'తో ముందుకు వస్తున్న బాలయ్యపై పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్‌‌లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్‌ చేయాల్సి రావటంతో ఆ సీన్స్‌ను డూప్‌తో చేయించాలని భావించారు చిత్రయూనిట్‌. 
 
అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్‌‌లో నటిస్తున్నాడు. 55 ఏళ్ల వయసులో కూడా స్టంట్స్‌ చేయడం చిత్ర యూనిట్‌‌ను ఆశ్చర్యపరిచింది. దర్శకుడు శ్రీవాస్‌.. బాలయ్యను అభినందించకుండా వుండలేకపోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. కాగా, ఈ చిత్ర ఆడియోను ఆంధ్ర రాజదాని అమరావతిలో గ్రాండ్‌గా విడుదలచేసే పనిలో వున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments