Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 102 సినిమా: అసిస్టెంట్‌ను కొట్టి.. చెప్పులు మోయించాడు.. ఎమ్మెల్యేగా అన్ ఫిట్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా 102వ చిత్రం రామోజీ ఫిలిమ్ సిటిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాక

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (11:24 IST)
నందమూరి బాలకృష్ణ హీరోగా 102వ చిత్రం రామోజీ ఫిలిమ్ సిటిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. బాలయ్య 101వ సినిమాకు గుమ్మడికాయతో కట్‌ చెప్పిన బాలయ్య గ్యాప్ లేకుండా 102వ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 
 
ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా జరుగనుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు. ఆమె కాకుండా మరో ఇద్దరు కథానాయికలకు ఈ కథలో చోటు ఉందట. అందువలన మరో ఇద్దరు కథానాయికల కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తున్నారు. 
 
త్వరలోనే ఆ ఇద్దరినీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. ప్రకాశ్‌రాజ్‌, మురళీమోహన్‌, అశుతోశ్‌ రానా బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్‌, సంగీతం: చిరంతన్‌భట్‌.

కాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా బాలయ్య తన అసిస్టెంట్‌పై చేజేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తుంది. అసిస్టెంట్ అలా కొట్టడం ఏంటని.. బాలకృష్ణ ఎమ్మెల్యేగా అన్ ఫిట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధి అయి వుండి సహనం కోల్పోయి.. ఇలా ఓ వ్యక్తిపై చేజేసుకోవడం సబబు కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments