బాలయ్య బాబుతో మీనాక్షి చౌదరి, త్రిష

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (17:11 IST)
బాలయ్య బాబు తన తదుపరి చిత్రంలో మీనాక్షి చౌదరి, త్రిషలతో నటిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఇప్పటికే ఓ హీరోయిన్‌గా త్రిషను ఫైనల్ చేసినట్లు టాక్. కథలో ఈ హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. 
 
కానీ ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఏది ఏమైనా బాలయ్య బాబు, మీనాక్షి చౌదరి, త్రిష కాంబినేషన్ అద్భుతం. ఇక ఈ సినిమాలో యాక్షన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య గెటప్, సెటప్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. 
 
ఈ సినిమా బాలయ్య తరహా యాక్షన్ డ్రామా కాదని, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 
 
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజకీయాల నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
 
బాలకృష్ణ చివరిసారిగా ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments