Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌న నాన్న గురించి అల్లు అర‌వింద్ గురించి స‌ర‌దాగా మాట్లాడిన బాల‌కృష్ణ‌

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (19:11 IST)
Aha- balakrishna
అల్లు అర‌వింద్ గారి మాన‌సిక పుత్రిక ఆహా! ఓటీటీ మాద్యమం. దానిలో ప్ర‌సారం కాబోయే `అన్ స్టాప‌బుల్‌` కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ యాంక‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు. కొద్ది సేప‌టికి క్రిత‌మే హైద‌రాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ స‌ర‌దా మాట‌ల‌తో హుసారెత్తించారు.
 
ఎన్నో ఏళ్ళుగా జాన‌ప‌దాలు, సాంఘికం, యాక్ష‌న్‌, కుటుంబ క‌థా చిత్రాలు చేశాను. ప్ర‌జ‌ల అభిమానం పొందాను. అంతులేని ప్రేమాభిమానాలు ఇచ్చారు. ఇంకా ఏదో చేయాల‌నే ప్రేర‌ణ‌తో  ఆహా ఓటీటీ మాద్యంలో యాంక‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాను. అల్లు అర‌వింద్‌గారు తెలుగువారి స‌త్తా చాటి ఆహా! అనిపిస్తున్నారు. పొట్టివారికి పుట్టెడు బుద్ధులు. చ‌నువుతో మాట్లాడుతున్నాను. వారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా స‌న్నిహితం. లెజెండ్ అల్లు రామ‌లింగ‌య్య‌గారి అబ్బాయి అర‌వింద్‌. చిన్న‌ప్పుడు మా ఇంటిలో వంట‌గ‌దిలో నేరుగా వెళ్ళి మా అమ్మ‌గారితో టీ పెట్టించుకునేవారు ఆయ‌న‌. ఎన్‌.టి.వోడు అనేవారు నాన్న‌ను. బండోడికి ఏమన్నా ఉన్నాయా ? మోయడానికి ? అనే వారు. అలాంటి చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్య గారికి మాత్రమే ఉంది” అంటూ వ్యాఖ్యానించారు బాల‌య్య‌.
 
ఇంకా ఆయ‌న మాట్లాడుతూ,  న‌ట‌న అనేది కేవ‌లం న‌వ్వ‌డం, కేక‌లు వేయ‌డ‌మేకాదు. పాత్ర ఆత్మ‌లోకి వెళ్ల‌డ‌మే. మూలాల్లోకి వెళ్ళాలి. అలా నేను చేసే అన్ని పాత్ర‌లు అలాంటివే. ఈరోజు `అన్ స్టాప‌బుల్‌` క‌రెక్ట‌న్ రైజ‌ర్ జ‌రిగింది. మ‌నిషి జీవితంలో ఏవోవో ఆలోచ‌న‌లతో జీవ‌నం ప్రారంభిస్తారు. ఉలితో రాయి రూపాన్ని తీసుకుంటుంది. అలా మ‌నిషి ఆటుపోటుల‌ను ఎదుర్కొని త‌న ల‌క్ష్యాన్ని చేరుకోవాలి. ఈ కాన్సెప్ట్ నాకు న‌చ్చింది. అందుకే ఆహా!లో యాంక‌ర్‌గా వున్నాను. నా జీవితం తెరిచిన పుస్త‌కం. అలాగే ప్ర‌తి న‌టుడు మ‌నిషి జీవితంలో ఎన్నో వుంటాయి. అవ‌న్నీ బ‌య‌ట‌కు చెప్పుకున్న‌ప్పుడు ప్ర‌శాంతంగా వుంటుంది. ఇది కూడా క‌ళాసేవ లాంటిదే. అని త్వ‌ర‌లో క‌లుద్దాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments