Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌కు ఇచ్చిన మాటను నిలుపుకున్న టాలీవుడ్‌ హీరో... ఎందుకో తెలుసా?

టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ. గత సంక్రాంతికి "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్. ఇపుడు ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. నిజానికి ఈ జంట తొలిసారి ‘చె

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:01 IST)
టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ. గత సంక్రాంతికి "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్. ఇపుడు ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. నిజానికి ఈ జంట తొలిసారి ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోనూ ఈ జంట కనువిందు చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య, శ్రియ ఆడిపాడబోతున్నారు. 
 
బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం ముగ్గురు నాయికలకు చోటుంది. ముస్కాన్‌ని ఇప్పటికే ఓ నాయికగా ఎంచుకొన్నారు. ఇప్పుడు శ్రియకు కూడా చోటు దక్కింది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సమయంలో శ్రియకు బాలయ్య ఇచ్చిన మాట ప్రకారం.. ఈ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ కల్పించారు. కాగా, పూరీ చిత్రంలో సన్నీలియోని ఓ ప్రత్యేక గీతంలో కనిపించబోతోంది. మరో కథానాయికని ఎంపిక చేయాల్సివుంది. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఈ చిత్రం కోసం రూ.1.5 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్‌ తీర్చిదిద్దారు. అక్కడే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెల 10 నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొంటారు. విదేశాల్లో కొంతమేర చిత్రీకరణ సాగనుంది. ఆ షెడ్యూల్‌లో శ్రియ సెట్లో అడుగుపెట్టబోతోంది. అనూప్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఆనంద ప్రసాద్‌ భవ్య క్రియేషన్స్‌ సంస్థపై తెరకెక్కిస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments