Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ జీవిత చరిత్రను 3 గంటల్లో చూపించలేం.. 2 పార్టులుగా...

స్వర్గీయ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా తెరకె

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (12:01 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. యువరత్న బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా, ఈ చిత్రాన్ని ఆయనే స్వయంగా తెరకెక్కిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 
 
ఇందులో తొలిభాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బాలయ్యకు చెప్పగా, ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారట. మరి బాలకృష్ణ తీసుకునే నిర్ణయంపై ఎన్టీఆర్ బయోపిక్ ఒకే పార్టులో వస్తుందా లేదా రెండు పార్టుల్లో వస్తుందా అనేది ఆధారపడివుంటుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments