Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ వీరసింహరెడ్డి : నిర్మాత నవీన్ యెర్నేని

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (16:11 IST)
varalami, balakrishna, gopichan, naveen and others
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి' వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా వీరసింహుని విజయోత్సవం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటో ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ఎనిమిది రోజుల్లోనే బాలకృష్ణ గారి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంకా లాంగ్ రన్ వుంది. సినిమా ఇంకా చాలా దూరం వెళుతుంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు 
 
బాలకృష్ణ మాట్లాడుతూ... నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి  అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు గోపీచంద్ మొదట వచ్చినపుడు చెన్నకేశవరెడ్డి గుర్తొస్తుందని చెప్పాను. తను అయోమయంలో పడ్డాడు. సీమరక్తం కదా కుతకుత లాడుతుందని అన్నాను. వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’...  అన్నాడు. ఒక అద్భుతమైన కథని రాశాడు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో అద్భుతమైన సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా అభిమానులు ‘వీరసింహారెడ్డి’ అద్భుతంగా వుందని ప్రసంశించారు. వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. తొడగొట్టి చెబుతున్నాను.. వీరసింహారెడ్డి లో సీమ వాసన కనిపించింది. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సాయి మాధవ్ బుర్రా పదునైన మాటలు రాశారు. ఇన్ని రకాల పాత్రలు చేశానంటే అది నా అదృష్టం. ఇంకా కుర్రాడిలా వుండటానికి నా రహస్యం అదే. సినిమా, నా హాస్పిటల్, హిందూపురం నియోజికవర్గం గురించి తప్పా నాకు మరో ఆలోచన లేదు. దునియా విజయ్, వరలక్ష్మీ గారు పోటాపోటీగా విలనిజం పండించారు. ఇన్నాళ్ళు అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష. మీ అంతులేని అభిమానం, అనంతమైన ఆత్మీయత, ఎవరికీ దక్కని ప్రేమానురాగాలు చూపిస్తున్న మీకు..మీ  బాలకృష్ణ మనసు ఎప్పుడూ పరిచివుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా సినిమానే ఊపిరిగా జీవిస్తున్న నిర్మాతలు రవి గారు నవీన్ గారు. ఒక మంచి సినిమాకి పని చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న మాకు ప్రేక్షకులు ఇంత ఘన విజయం ఇచ్చారంటే.. మా వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్లుందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు’’  తెలియజేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments