ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్‌ పిల్లలకు స్పూర్తి నింపిన బాలకృష్ణ

దేవీ
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (15:52 IST)
Andhra School Wadala, Mumbai, Balakrishna
ప్రముఖ సినీ నటుడు,  శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముంబైలోని వాడాలాలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించి, విద్యార్థులకు స్ఫూర్తిని అందించారు. గత 77 సంవత్సరాలుగా తెలుగు సమాజానికి విద్యా సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తన గొప్ప చరిత్రతో విద్యా రంగంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.
 
Andhra School Wadala, Mumbai, Balakrishna
నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో సుమారు 4,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. 150 మంది అధ్యాపకులు, సిబ్బంది వీరికి నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.
 
బాలకృష్ణ గారి సందర్శన సమయంలో విద్యార్థులు ఉత్సాహంతో ఆయనతో సంభాషించారు. ఆయన ప్రోత్సాహకరమైన సందేశాలు విద్యార్థులలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. విద్యార్థుల ఆనందభరిత వాతావరణం పాఠశాల ప్రాంగణంలో సందడిని నింపింది.
 
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రామ్మోహన్ బండ్లమూడి, జనరల్ సెక్రటరీ శ్రీ కృష్ణప్రసాద్ బాలకృష్ణ గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్శన విద్యార్థులకు ఒక చిరస్థాయి జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు తెలిపారు. బాలకృష్ణ స్ఫూర్తిదాయక మాటలు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటాయని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments