Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదుటివాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో: #BB3 First Roarతో న‌ట‌సింహం

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (21:14 IST)
మీసం మెలేస్తున్న బాలయ్య
'సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ #BB3 రూపొందుతోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా #BB3 First Roar పేరుతో ఓ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌తో కూడిన టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజ‌సంగా న‌డిచివ‌స్తున్న‌ బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. `ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీ‌ను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికీ, శ్రీ‌ను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా... అని న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.
తొడ కొడుతున్న నటసింహం
థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్ఫుల్‌గా మంచి కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్‌గా తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియ‌జేయ‌నున్నారు.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌‌,  మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments