Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎనౌన్స్ చేసిన బాల‌య్య‌ (Video)

నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తోన్న‌ విషయం తెలిసిందే. డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి తదుపరి దర్శకుడు ఎవరనేది ఆస‌క్తిగా మారింది. దీంతో ర‌క‌ర‌కాల ద‌ర్

Webdunia
సోమవారం, 28 మే 2018 (15:13 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్.టి.ఆర్’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నిర్మిస్తోన్న‌ విషయం తెలిసిందే. డైరెక్ట‌ర్ తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో ‘ఎన్.టి.ఆర్’ చిత్రానికి తదుపరి దర్శకుడు ఎవరనేది ఆస‌క్తిగా మారింది. దీంతో ర‌క‌ర‌కాల ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చాయి. ఈ విషయమై జ‌రిగిన ప్ర‌చారానికి నందమూరి బాలకృష్ణ ఫుల్‌స్టాప్ పెట్టారు. 
 
బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి దర్శకత్వం వహించిన క్రిష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ‘జనని భారత మెచ్చజగతి హారతులెత్త జనశ్రేణి ఘనంగా దీవించి నడుపగా రణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నినదించె మొనగాడు.. ‘ఎన్.టి.ఆర్’ .. అంటూ ఈ వీడియోలో బాలకృష్ణ వాయిస్ ఓవర్ చెప్పారు. 
 
‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెబుతున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది. ప్రతి ప్రాణానికి ఒక కథ ఉంటుంది. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది! నా నూరవ చిత్రాన్ని చరితగా మలిచిన క్రిష్ జాగర్లమూడి.. ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నా. 
 
ఇది, మా కలయికలో రెండో దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణ. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది.. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది. ప్రతి నిమిషం మీ కుశలాలు కాంక్షించే.. మీ నందమూరి బాలకృష్ణ’ అని ఈ వీడియోలో బాలయ్య పేర్కొన్నారు. చూడండి ఈ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments