Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయదశమి స్పెషల్ : బీబీ4పై కీలక అప్‌‍డేట్...

ఠాగూర్
శనివారం, 12 అక్టోబరు 2024 (13:22 IST)
విజయదశమి పండుగను పురస్కరించుకుని హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంపై కీలక అప్‌డేట్ వచ్చింది. బీబీ4 పేరుతో ఈ ప్రాజెక్టుపై కీలక సమాచారాన్ని వెల్లడించింది. బాలకృష్ణ - బోయపాటి శీను కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. ఇపుడు నాలుగో చిత్రం తెరెకెక్కనుంది. ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఇపుడు బీబీ4 చిత్రం తెరకెక్కనుంది. ఈ నెల 16వ తేదీన ఈ కొత్త చిత్రం ప్రారంభంకానుంది. 
 
ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో "సింహా", "లెజెండ్‌", "అఖండ" చిత్రాలు రాగా, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు మ‌రోసారి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి జ‌త క‌డుతున్నారు. ఇటీవ‌లే దీనిపై అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇవాళ ద‌స‌రా సంద‌ర్భంగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ బీబీ4 షూటింగ్ అప్డేట్‌ను ఇచ్చింది. మూవీ షూటింగ్ ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల‌ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 
 
'అంద‌రికీ విజయ దశమి శుభాకాంక్షలు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీ4 సెన్సేషనల్ ప్ర‌క‌ట‌న చేస్తున్నాం. ఈ మాసివ్ ఎపిక్ కాంబినేషన్ గ్రాండ్ జర్నీ మొదలు కానుంది. అక్టోబరు 16న ఉదయం 10 గంటలకు ముహూర్తం ఖరారు చేశాం' అని త‌న ట్వీట్‌లో 14 రీల్స్ రాసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

UP: ఆంటీతో ప్రేమ.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.. అంతే గొంతు నులిమి చంపేశాడు..

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments