Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తిచేసుకొన్న బాలకృష్ణ 102వ చిత్రం

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగిసింది. అరివుమణి-అంబుమణిల స

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (19:11 IST)
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగిసింది. అరివుమణి-అంబుమణిల సారధ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌లను బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌యన‌తార‌, న‌టాషా, హరిప్రియ, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ముర‌ళీ మోహ‌న్‌, జేపీ, ఎల్బీ శ్రీ‌రామ్‌ల‌తో పాటు ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణం కూడా పాలుపంచుకొంది.
  
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.."అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా షూట్ చేయడం జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్‌లో ఈ కీలకమైన ఎపిసోడ్‌ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది``  అన్నారు.
 
బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి,  ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments