Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానులకు బాలయ్య విజ్ఞప్తి..!

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (10:45 IST)
జూన్ 10 నందమూరి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే.. ఆ(ఈ)రోజు నందమూరి నట సింహం బాలయ్య పుట్టినరోజు. ఈ సంవత్సరం బాలయ్య 60వ పుట్టినరోజు. అందుకే.. అభిమానులకు ఈ పుట్టినరోజు ప్రత్యేకం. అందుకనే.. అభిమానుల కోసం బాలయ్య.. బోయపాటితో చేస్తున్న మూవీ టీజర్ రిలీజ్ చేసారు.
 
ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిన్న టీజర్ ఈ మూవీపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే... ఈ టీజర్‌తో పాటు జై బాలయ్య అంటూ సింగర్ సింహా పాడిన రిలీజ్ చేసారు. ఈ పాట బాలయ్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
 
ఇక అసలు విషయానికి వస్తే.... పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు విజ్ఞప్తి అంటూ ఓ లేఖను రిలీజ్ చేసారు బాలయ్య. ఇంతకీ.. ఆ లేఖలో ఏం రాసారంటే నా 60వ పుట్టినరోజును మీ ఇంటి పండగలా.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మొదలుపెట్టి... నా హితులు, శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులైన అభిమానులందరితో కలిసి వేడుక చేసుకునే అదృష్టానికి అంతరాయం కలిగినందుకు బాధగా ఉంది.
 
కరోనా విజృంభిస్తున్న ఈ టైమ్‌లో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత.  మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం.. మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుచేత మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి నన్ను కలవడానికి రావద్దు అని బాలయ్య తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

పాకిస్థాన్‌కు మరో షాకిచ్చిన కేంద్రం... దిగుమతులపై నిషేధం!

Class 11 Exam: పొలంలో తొమ్మిది మందిచే అత్యాచారం.. 11వ తరగతి పరీక్షలకు బాధితురాలు

16 యేళ్ల మైనర్ బాలుడుపై 28 యేళ్ళ మహిళ అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments