Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 రోజుల్లో రూ. 300 కోట్లు... రాజమౌళి "బాహుబలి'' మాయ... టాలీవుడ్ డైరెక్టర్స్‌కు 'హై బడ్జెట్' ఫీవర్

Webdunia
సోమవారం, 20 జులై 2015 (15:49 IST)
టాలీవుడ్ మెగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ప్రేక్షకుల చేత సినిమా చూసేట్లు చేయడం వెన్నతోపెట్టిన విద్య. చిత్రంలో నటించేవారు చిన్న హీరోలు కావచ్చు లేదా బడా స్టార్లూ కావచ్చు. కథను పట్టి సినిమా తీశాడంటే హీరోలు కనబడరు.... క్యారెక్టర్లే కనబడతాయి. అదే మెగా ఫిలిమ్ బాహుబలిలో మరోసారి రుజువైంది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 9 రోజులైంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు ఒకరు తెలియజేస్తున్నారు. హిందీ వెర్షన్ వసూళ్లు ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రం, ఆ మాటకొస్తే ఈ ప్రాంతీయ భాషా చిత్రం వసూలు చేయని రూ. 50 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. 
 
సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్ చిత్రం విడుదలతో బాహుబలికి కాస్త బ్రేకులు పడుతాయని అనుకున్నారు కానీ.. అదేమీ జరుగలేదు. యధావిధిగా కలెక్షన్లు రాబడుతూనే ఉంది. మరోవైపు రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రంతో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే తన పేరును మారుమ్రోగేట్లు చేయడంతో ఇపుడు మిగిలిన దర్శకులు కూడా భారీ చిత్రాల రూపకల్పన కోసం స్కెచ్ లు వేస్తున్నారు. 
 
ఇప్పటికే శ్రీమంతుడు ఆడియో వేడుకలో వినాయక్ మహేష్ బాబుతో రూ. 100 కోట్ల సినిమా తీయాలని ఉందని చెప్పుకున్నారు. దీనితో ఇక రాబోయే చిత్రాలన్నీ 100 కోట్ల రూపాయలు దాటిపోయే చిత్రాలేమోననే అనుమానం కూడా కలుగుతోంది. వినాయక్ బయటకు చెప్పేశారు కానీ చెప్పకుండా లోలోన ప్రయత్నాలు చేస్తున్న దర్శకులు చాలామంది ఉన్నారనేది టాక్. చూడాలి... టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ రేంజికి వెళుతుందో...?!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments