Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి అను ఒక బ్లాక్ మార్కెట్: ప్రీమియర్ షో టిక్కెట్ రూ. 3 వేలు. కనీస టిక్కెట్ ధర వెయ్యి.. అయినా దొరకదు

టిక్కెట్ల్ బ్లాక్ మార్కెట్ ప్రపంచ మంతటా ఈ స్థాయిలో జరిగితే బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్లు ఏమిటి? రెండువేల కోట్ల రూపాయలను కూడా ఈజీగా దోచుకుంటుందని బోగట్టా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే రెండేళ్లు పాటు దాచిన రహస్యాన్ని చూడాలంటే ఏప్రిల్ 28 నుంచి స

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (03:58 IST)
టిక్కెట్ల్ బ్లాక్ మార్కెట్ ప్రపంచ మంతటా ఈ స్థాయిలో జరిగితే బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్లు ఏమిటి? రెండువేల కోట్ల రూపాయలను కూడా ఈజీగా దోచుకుంటుందని బోగట్టా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే రెండేళ్లు పాటు దాచిన రహస్యాన్ని చూడాలంటే ఏప్రిల్ 28 నుంచి సగటు ప్రేక్షకుడు కనీసం 15 రోజులపాటు థియేటర్ జోలికి పోకుంటే చాలు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే బాహుబలి ది కంక్లూజన్ సినిమాకు టిక్కెట్లు లేవు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ తేడాలేదు. లక్షలాది టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. అది కూడా భారీ రేట్లతో. 70 రూపాయలు, వంద రూపాయలు టికెట్ మాట రెండు వారాలు మర్చిపోండి. రోజుకు 6 ఆటలు ఏపీలో, 5 ఆటలు తెలంగాణలో ప్రదర్శించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా నిర్మాతలు తెచ్చేసుకోవడంతో ఇక నిర్మాతలు, పంపిణీదారులు కలిసి ఆడుతున్న టికెట్ల దందా జోరు పుంజుకుంది. 
 
థియేటర్ని బట్టి ఒక్కో టికెట్‌ ధరా రూ.300 నుంచి రూ.500 దాకా అమ్ముతున్నారు. అంటే.. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం బాహుబలి సినిమాకు వెళ్లాలంటే ‘పింక్‌ నోటు’కు.. అనగా 2000 రూపాయల నోటుకు నీళ్లూనువ్వులూ వదులుకోవాల్సిందే!! ఇది మామూలుగా జరిగే అమ్మకాల మాట. టికెట్లు అందుబాటులో లేవు కాబట్టి.. బ్లాక్‌ మార్కెట్‌ కూడా ‘బాహుబలియన్‌’ స్థాయిలో విజృంభిస్తోంది!! రూ.1000.. రూ.1500.. కొనేవాడి అభిమానాన్ని బట్టి రూ.2000కు కూడా అమ్మేస్తున్నారు!! 
 
ఇక ప్రీమియర్‌షోల పేరుతో జరిగే సంప్రదాయబద్ధ ‘సొమ్ము చేసుకునే ప్రక్రియ (ఒక్క మాటలో చెప్పాలంటే.. దోపిడీ)’ సరే సరి. ఈ ప్రీమియర్‌ షో టికెట్ల వెల రూ.3 వేల దాకా పలుకుతున్నట్టు సమాచారం. అయినా సరే.. టికెట్ల కోసం కొట్టేసుకుంటున్నారు! తెలంగాణలో ఒక మామూలు పోలీసు బాహుబలి-2 సినిమాకు వెళ్లాలి. ఏప్రిల్ 28న సెలవు కావాలి ఇప్పించండి అంటూ తన పై అధికాురులను వేడుకుంటూ ఉత్తరం పంపాడంటే బాహుబలి క్రేజ్ ఏ స్ధాయిలో ఉందో అర్థం అవుతుంది.
 
ఈ క్రేజీ లేదా ఉన్మాదం అమెరికాకు కూడా వ్యాపించినట్లుంది. అమెరికాలో బాహుబలి2 సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షో టిక్కెట్ ధర ఒకటికి 35 డాలర్లట. అంటే దాదాపుగా 2,500 రూపాయలు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల నాటికి ఇది ఏ రేటు పలుకుతుందో చెప్పలేం. ప్రపంచం మునిగిపోయినా సరే అమెరికా ఉత్తర కొరియా మీద, ఉత్తర కొరియా అమెరికా మీద అణుబాంబులు విసురుకుని చచ్చినా సరే.. మాకనవసరం. ఇప్పుడు బాబుబలి 2 సినిమా చూడాలంతే.. ఈ ఉన్మాదం ముందు ఏ లాజిక్కులూ పనికిరావు.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments