Webdunia - Bharat's app for daily news and videos

Install App

''బాహుబలి-3'' ఊహలకందని ట్విస్టు

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (19:01 IST)
తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన బాహుబలి ఫ్రాంచైజీలోని రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల ప్రచారం సందర్భంగా ఆర్కా మీడియా రాజమౌళి అంతర్జాతీయ వేదికల్ని ఎంచుకొని ఎంతటి ఘన విజయాన్ని సాధించారో అందరికీ తెలిసిందే. 
 
ఈ రెండు భాగాలూ కలిపి ఏకంగా (జపాన్‌తో సహా) రూ. 2200 కోట్లు వసూలు చేయడం జరిగింది. కాగా ఇది కేవలం బాక్సాఫీస్ విజయమే కాదు ఈ చిత్రంలో పాత్రలది కూడా... వీటి గురించి దేశ విదేశాల్లో జనాలు ఎంతో ఆసక్తిగా మాట్లాడుకున్నారు. బాహుబలి- భళ్లాలదేవ- శివగామి- కట్టప్ప పాత్రల గురించి విదేశాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది.
 
అయితే... ఈ ఫ్రాంఛైజీలో బాహుబలి 3 తెరకెక్కించే పక్షంలో అందులో తాను కూడా నటిస్తానని అవెంజర్స్ స్టార్... ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు శ్యామ్యుల్ జాక్సన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవెంజర్స్ ఇండియా విడుదల గురించి మాట్లాడే సందర్భంలో ఆయన బాహుబలి ఫ్రాంఛైజీపై తన ఆసక్తిని కనబరిచారు. అంతకుముందు 2018 సెన్సేషనల్ హాలీవుడ్ మూవీ `బ్లాక్ పాంథర్` లో నటించిన స్టార్లు బాహుబలి గురించిన ప్రస్థావించడం చర్చకు వచ్చింది. 
 
తాజాగా `బాహుబలి- 3` పోస్టర్ అంటూ ఐపీఎల్ క్రికెటర్లు ప్రస్థావించడం మరోమారు అభిమానులలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలో హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్‌గా పేరున్న వార్నర్ విలియమ్సన్ బాహుబలి 3లో నటించాలని ఉందన్న తన కోర్కెని తెలియజేయడంతో అభిమానులలో వేడెక్కించే చర్చ సాగుతోంది. సినిమాల్లో నటించాలనుకుంటే ఏ సినిమాలో నటిస్తారు? అని సన్ రైజర్స్ ప్లేయర్స్ వార్నర్ విలియమ్సన్‌లను ప్రశ్నించినప్పుడు, అటు నుండి వినిపించిన ఏకైక సమాధానం `బాహుబలి`. 
 
మొత్తానికి హాలీవుడ్, బాలీవుడ్‌ అనే కాకుండా క్రికెట్‌ వరల్డ్‌లోనూ బాహుబలి క్రేజ్ ఏ మేరకు పాతుకుపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సిరీస్ లో` బాహుబలి 3` తెరకెక్కించేందుకు రాజమౌళి ఆసక్తిగా ఉన్నారా? అంటే దీనికి సమాధానం మాత్రం జక్కన్న ప్రస్తుతం రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తయితే కానీ చెప్పలేం. అదేమో 2020 జూలై 30న విడుదల కానుంది. కాబట్టి అప్పటికి జక్కన్న ఏం నిర్ణయిస్తాడో... ఇప్పుడే చెప్పేయలేముగా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments