Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బాహుబలి: ది కన్‌క్లూజన్‌": శివగామి ట్వీటాడింది.. నీలాంబరికి తర్వాత పవర్ ఫుల్ పాత్ర ఇదే..

"బాహుబలి: ది కన్‌క్లూజన్‌" శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నుంచే రికార్డులను తిరగరాసింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం తొలి రోజు భారత్‌లో రూ.121 కోట్లు వసూ

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (17:22 IST)
"బాహుబలి: ది కన్‌క్లూజన్‌" శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ నుంచే రికార్డులను తిరగరాసింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం తొలి రోజు భారత్‌లో రూ.121 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా నటీనటులు యూనిట్‌పై పలువురు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. 
 
తాజాగా "బాహుబలి- ది కంక్లూజన్ ఒక అద్భుతం".. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి ఎంతైనా అభినందనీయుడని మెగాస్టార్ చిరంజీవి కితాబునిచ్చాడు. తెలుగు సత్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హ్యాట్సాఫ్‌ అన్నాడు. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్‌ తదితరులను అభినందించాడు. ప్రత్యేకంగా విజయేంద్రప్రసాద్‌, కీరవాణి, సెంథిల్‌, ఇతర సాంకేతిక నిపుణులకు స్పెషల్ కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు.
 
ఇదేవిధంగా బాహుబలి చిత్రంతో శివగామిగా నటించిన రమ్యకృష్ణ చేసిన పవర్ ఫుల్ పాత్రకు ఆడియన్స్ జేజేలు కొట్టారు. కొన్నాళ్ల వరకు ఈమె పాత్ర అందరి మనసులలో అలా నిలిచిపోతుంది. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర తర్వాత రమ్య కృష్ణ చేసిన పవర్ ఫుల్ పాత్ర ఇదే అని చెప్పవచ్చు. 
 
రాజమాతగా రమ్యకృష్ణ ఆ పాత్రకి అలా ఒదిగిపోయింది. ప్రతి ఒక్కరు ఆమె నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే తనపై ఇంత అభిమానం, ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రమ్యకృష్ణ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments