Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వైయస్సార్' పేరు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకున్న సింధు... బాలయ్యకిచ్చింది...

పి.వి. సింధు అనగానే ఒలింపిక్ క్రీడలు గుర్తుకు వస్తాయి. తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్టుగా చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో పాల్గొంది. ఆమె వరుసగా అమితాబ్ ఇచ్చిన 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చె

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (11:49 IST)
పి.వి. సింధు అనగానే ఒలింపిక్ క్రీడలు గుర్తుకు వస్తాయి. తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్టుగా చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో పాల్గొంది. ఆమె వరుసగా అమితాబ్ ఇచ్చిన 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రూ. 12.5 లక్షలు గెలుచుకుంది. ఆ తర్వాత రూ. 25 లక్షల గెలుచుకునే 13వ ప్రశ్న వద్ద అమితాబ్ వైయస్సార్ సీపి లోని వై.యస్.ఆర్ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. 
 
దానికి ఆఫ్షన్లు 1. యువ సత్యరాజ్యం 2. ఎడుగూరి సంధింటి రాజశేఖర 3. యూత్ షల్ రూల్ 4. యువజన శ్రామిక రైతుల అని చెప్పారు. దానికి సింధు... ఎడుగూరి సంధింటి రాజశేఖర అని చెప్పి తప్పులో కాలేసింది. దాంతో అమితాబ్ బాగా ఆలోచించుకోమని కోరడంతో ఆమె తన సోదరి సహాయాన్ని కోరింది. 
 
ఆమె ఇచ్చిన సరైన సమాధానం యువజన శ్రామిక రైతుతో రూ. 25 లక్షలు గెలుచుకుంది. ఈ పోటీలో తను హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిధులకోసం పాల్గొనడం విశేషం. గెలుచుకున్న డబ్బును క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్  గా వున్న బాలయ్యకు అందించనున్నట్లు సింధు తెలిపింది. అలా వైయస్సార్ పేరుతో రూ. 25 లక్షలు అందించనున్నదన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments