Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఊరి జాతరలో బచ్చల మల్లి ఎం చేసాడు?

డీవీ
సోమవారం, 15 జులై 2024 (09:52 IST)
Allari Naresh Amrita Iyer
హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన హీరో నరేష్ మాస్-అప్పీలింగ్ బర్త్ డే గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. 'బచ్చల మల్లి' ఫస్ట్ సింగిల్ 'మా ఊరి జాతరలో' జూలై 16న విడుదల కానుంది. 'సీతారామం' ఫేం విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమా కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. 
 
ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్ లో ఆదరగొట్టబోతున్నారు. డైరెక్టర్ సుబ్బు నరేష్ ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments