Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కూల్చివేత ఓ హిట్ అండ్ రన్ కేసు ... డ్రైవర్లంతా నిర్దోషులా? ప్రకాష్ రాజ్

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (15:14 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పును బీజేపీ నేతలంతా స్వాగతించారు. కానీ, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం హిట్ అండ్ రన్ కేసుతో పోల్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త భారత్' అని ట్వీట్ చేశారు. 
 
కాగా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపుతిప్పిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని, నిందితులను దోషులుగా తేల్చేందుకు ఆధారాలు లేవని తేలుస్తూ.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. పైగా, మసీదును కూల్చివేసింది సంఘ విద్రోహ శక్తులంటూ కోర్టు అభిప్రాయపడింది. 
 
మసీదును కూల్చింది సంఘ వ్యతిరేకులు.. 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో పేర్కొన్నవారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. పైగా, బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ముందస్తు ప్రణాళిక రచించలేదని న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తీర్పునిచ్చారు. మొత్తం 2 వేల పేజీలు ఉన్న తీర్పు కాపీని ఆయన చదివి వినిపించారు. 
 
దీంతో దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ అగ్రనేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతితో పాటు సంఘ్ ‌పరివార్‌ నేతలందరూ నిర్దోషులుగా తేలారు. బాబ్రీ మసీదును కూల్చివేసినవారు సంఘ వ్యతిరేకులని కోర్టు తీర్పులో పేర్కొంది. 
 
నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. నిందితులు అందరినీ నిర్దోషులుగా తేల్చినట్లు ప్రకటించింది. వారంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని స్పష్టం చేసింది. 
 
లక్నో 18వ నెంబ‌ర్ కోర్టులో రూమ్‌లో తీర్పును వెలువ‌రించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషీ, ఉమాభార‌తి కోర్టుకు హాజ‌రుకాలేదు.  1992, డిసెంబ‌ర్ 6వ తేదీన బాబ్రీ మ‌సీదును ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ, జోషీలు.. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments