Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమా గర్వించదగిన క్షణం..బాహుబలి వచ్చేశాడు

ఒక తరం జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిల్చిపోనున్న క్షణం రానే వచ్చింది. భారత చలన చిత్ర చరిత్రలో అత్యంత సాహసేపేతమైన చిత్రం ముగింపు ఇప్పుడు మన ముంగిట్లో ఉంది. అద్వితీయమైన వర్ణన, అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్టులు, నేషన్ వాంట్స్ టు నో అంటూ జాతి ముందు నిలబడిన అత్యంత

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (08:42 IST)
ఒక తరం జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిల్చిపోనున్న క్షణం రానే వచ్చింది. భారత చలన చిత్ర చరిత్రలో అత్యంత సాహసేపేతమైన చిత్రం ముగింపు ఇప్పుడు మన ముంగిట్లో ఉంది. అద్వితీయమైన వర్ణన, అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్టులు, నేషన్ వాంట్స్ టు నో అంటూ జాతి ముందు నిలబడిన అత్యంత రహస్యమైన ప్రశ్నతో బాహుబలి ది బిగినింగ్‌ను ముగించిన రాజమౌళి తొలిభాగంలోని సస్పెన్స్, కుట్రలు, కథా మార్మికత్వం వెనుక ఉన్న రహస్యాన్ని విప్పటానికి ముందుకొచ్చాడు. మాహిష్మతి ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లడంలో, ఆ అత్యద్భుత కథాస్రవంతిలోకి మనందరినీ లాక్కెళ్లి పోవడంలో అసాధారణ విజయం సాధించాడు రాజమౌళి. రెండో భాగం వర్ణన 170 నిమిషాల వరకు సాగినప్పటికీ మొత్తంమీద ఒంటిమీద రోమాలు నిక్కపొడుచుకునేలా చేసి గగుర్పాటుకు గురిచేయడంలో సక్సెస్ అయ్యాడు. 
 
సాంకేతికంగా చూస్తే బాహుబలిని బీట్ చేయగల సినిమా సమీప భవిష్యత్తులో పుట్టలేదంటే ఆశ్చర్యం లేదు. స్మానిష్ ఆర్మడాను గుర్తుకు తెచ్చే ఓడ, మాహిష్మతి రాజ్యపు నోటిని తలపించే అత్యంత భారీ ఏనుగు, హీరో హీరోయిన్లను తీసుకుపోతున్న బోటు చుట్టూ అలుముకున్న అత్యద్భుత ఊహాశక్తి, కుంతల రాజ్యంపై దండెత్తవచ్చిన పిండారులపై బాహుబలి, దేవసేన సంధించిన శరపరంపర. ఇవన్నీ ఆర్ట్ వర్క్‌కు చెందిన అత్యద్బుతమైన కృషికి చిహ్నాలు. ఇక విజువల్ ఎఫెక్టులయితే మనం చెల్లించే ప్రతి పైసాకు విలువ నిచ్చేలా ఉన్నాయి. నిజంగా రాజమౌళి పీఎప్ఎక్స్‌కు తక్కువ ప్రాధాన్యమిచ్చి, యుద్ధ దృశ్యాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఉంటే తను సెసెలో డిమిల్లె, వి. శాంతారాం, సుభాష్ ఘాయ్ వంటి ప్రముఖ దర్శకుల కలబోతగా మాత్రమే మిగిలిపోయేవారు. కాని ఒక గొప్ప కథ చుట్టూ అలుముకున్న కోట్లాది మంది ఊహలకు ప్రాణం పోయడానికి దర్శకుడు విజువల్ ఎఫెక్టుల ద్వారా చూపిన సాహసం అనన్య సామాన్యమైనవి. అదే ఈ చిత్రానికి జవజీవాలను ఇచ్చింది.  ప్రబాస్, అనుష్క సినిమా భారాన్నిమొత్తంగా తమ భుజాలపై వేసుకున్నారు. ఇక ప్రభాస్ కేవలం తన చూపులతోనే యావన్మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు.
 
ఒక ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి బాహుబలి తొలి భాగంలో వినిపించిన విమర్శలన్నింటికీ సీక్వల్‌తో సమాధానమిచ్చాడు. బాహుబలి 1స్థాయికి మించి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడు. నటీనటుల నుంచి అద్భుతమైన నటన తీసుకోవటంతో పాటు గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా ప్రతీ అంశంలోనూ ది బెస్ట్ అనిపించుకునే స్థాయిలో సినిమాను రూపొందించాడు. 
 
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం ప్రభాస్ పడిన కష్టం చూపించిన డెడికేషన్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.
 
ఇక క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్లతో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. తొలి భాగాంతంలో కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. బాహుబలి ప్రియురాలిగా అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది.
 
బాహుబలి విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం గ్రాఫిక్స్. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహిష్మతి రాజ్యం, పాటు యుద్ధ సన్నివేశాల్లో ఏది గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశారో.. ఏది రియల్‌గా షూట్ చేశారో అర్ధం కానంత నేచురల్‌గా ఉన్నాయి గ్రాఫిక్స్. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కమల్ కణ్నన్ టీం కృషి సినిమా స్థాయిని పెంచింది.
 
మొత్తం మీద చెప్పాలంటే బాహుబలి 2 ఇప్పటికిప్పుడే ముగియని ఒక సుదీర్ఘ గాధ. చిన్న చిన్న లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నప్పటికీ రాజమౌళిలో ఉన్న కథాకథన సామర్థ్యానికి నిజమైన నివాళి బాహుబలి-2. ఇది తెలుగు సినిమా గర్వించదగిన క్షణం. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments