Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2 కి 9.3 యూజర్ రేటింగ్ ఇచ్చిన ఐఎమ్‌డిబీ: ఇండియన్ సినిమాల్లో ఇదే హైయస్ట్ రికార్టు

ఇంట్నెషనల్ మూవీ డేటా బేస్ అయిన ఐఎమ్‌డిబి అయితే బాహుబలి2 సినిమాకు పది స్టార్‌లకు గాను 9.3 యూజర్ రేటింగ్ ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. బాహుబలి2 సినిమా క్రేజ్ ప్రేక్షకులలో ఎ స్థాయిలో ఉందో ఇది చెప్పకనే

Webdunia
బుధవారం, 3 మే 2017 (02:33 IST)
బాహుబలి రికార్టుల వేట సాగుతూనే ఉంది. ఇండియన్ సినిమా ఆల్ టైమ్ ఎపిక్ వండర్ బాహుబలి2 బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న రికార్డులు అందరికీ తెలిసినవే. ఈ విజువల్ వండర్ చిత్రానికి ప్రతి మీడియా క్రిటిక్ కూడా 3.5 నుంచి 4.5 వరకు స్కోర్ రేట్ ఇచ్చి అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిలిపారంటే బాహుబలి2 ఎలాంటి కళాఖండమో చెప్పకనే చెప్పారు. రికార్డుల పరంగా చూస్తే బాహుబలి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత సృష్టిస్తోంది. 
 
ఇది ఇలా ఉంటే ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ అయిన ఐఎమ్‌డిబి అయితే బాహుబలి2 సినిమాకు పది స్టార్‌లకు గాను 9.3 యూజర్ రేటింగ్ ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. బాహుబలి2 సినిమా క్రేజ్ ప్రేక్షకులలో ఎ స్థాయిలో ఉందో ఇది చెప్పకనే చెబుతోంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇంతవరకు ఏ బాషా చిత్రానికి కూడా 10 కి 9.3 స్టార్ రేటింగు ఇవ్వడం జరగలేదు. బాహుబలి ది బిగినింగ్ తొలి భాగం కూడా 9 యూజర్ స్కోర్ సాధించడం విశేషం.
 
ఇదివరకు తెలుగు సినిమాలలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాకు మాత్రమే ఐఎమ్‌డీబీ 10కి 8.4 యూజరం రేటింగ్ ఇచ్చింది. ఏవిధంగా చూసినా బాహుబలి2 సినిమా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.సినిమా పాపులారిటీ ఇలాగే కొనసాగితే ఈ రేటింగ్ కూడా పెరిగి ఆల్ టైమ్ హండ్రెడ్ మూవీల్లో చోటు దక్కించుకోవటం ఖాయం అంటున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments