Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ''బాహుబలి''... భారీ పోస్టర్ గిన్నిస్ రికార్డ్...

Webdunia
బుధవారం, 1 జులై 2015 (11:38 IST)
సాధారణంగా సినిమాలు విడుదలయిన తర్వాత రికార్డులు సొంతం చేసుకుంటాయి. అయితే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' చిత్రం మాత్రం విడుదలకు ముందుగానే రికార్డులు, రివార్డులు పొందేస్తుంది. రెండు భాగాలుగా విడుదలవుతున్న 'బాహుబలి' తొలి భాగం 'ది బిగినింగ్' పేరిట ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ చిత్రం జూలై పదో తేదీన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీషు, ఫ్రెంచ్ భాషల్లో తెరకెక్కి, విడుదలకు సిద్ధమైంది. కేరళలో 'బాహుబలి' చిత్రం విడుదల హక్కులను గ్లోబల్ యునైటెడ్ మీడియా పొందింది. వారు చిత్ర ప్రమోషన్‌ వర్క్‌లో భాగంగా కొచ్చి‌లో బాహుబలి భారీ పోస్టర్‌ను రూపొందించారు. ఇప్పుడు ఈ భారీ పోస్ట్ గిన్నిస్ రికార్డుకెక్కింది.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో గతంలో ఉన్న భారీ పోస్టర్ 5,087.25 చదరపు అడుగుల రికార్డును బాహుబలి పోస్టర్ బద్దలుకొట్టింది. తాజాగా రూపొందించిన బాహుబలి పోస్టర్ 51,968.32 చదరపు అడుగులుగా ఉంది. ఈ చిత్రం విడుదల అయిందంటే ఇటువంటివి మరిన్ని రికార్డులను పొందుతుందని చిత్ర యూనిట్ ఆత్మవిశ్వాసం వ్యక్తంచేస్తోంది.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments