Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి విజయం ఒక మహా విశ్వాసం.. అతి భారీ చిత్రాలకు అదొక నాంది.. రానా ప్రశంసల వర్షం

బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని బల్లాలదేవ పాత్రధారి రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బా

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (08:02 IST)
బాహుబలి సినిమా దేశవ్యాప్త ఆదరణ పొందడానికి తనవంతు పాత్ర పోషించిన రానా ఒకటవ భాగం నుంచి రెండోభాగం వరకు చిత్ర ప్రచారంలో అద్వితీయ పాత్ర పోషిస్తూనే ఉన్నారు. చిత్రంలోని పాత్రలను మీడియాకు వర్ణించడంలో రానా తర్వాతనే మరొకరి గురించి చెప్పుకోవలసి ఉంది. అందుకే ప్రమోషన్లలో ప్రభాస్ మిస్ కావచ్చు కానీ దేశంలోని అన్ని ప్రాంతాలనూ రాజమౌళితో పాటు సందర్శించి తన అనుభవాలను పంచుకున్న రానా శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవాడు. ఇక నాలుగు రోజుల్లో బాహుబలి-2 విడుదల కానున్న సందర్భంగా మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రానా బాహుబలి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు.  భారత దేశం మొత్తంలో భారీ బడ్జెట్‌ చిత్రాలకు లైసెన్స్‌ ‘బాహుబలి’, అందుకే అది కేరళ వంటి చిన్న ప్రాంతంలో వెయ్యి కోట్ల ఖర్చుతో మహాభారతాన్ని తీయడానికి పూనుకునేంత స్పూర్తిని ఇచ్చిందని రానా చెప్పారు.
 
బాహుబలి విజయం భారతీయ చలన చిత్ర నిర్మాతల్లో గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిదని బల్లాలదేవ పాత్రధారి రానా చెప్పుకొచ్చారు. ఒక భాషలో  మొత్తం దేశం కోసం సినిమా చేయడం మిగిలిన సినిమాలకంటే గొప్ప విషయమని బాహుబలి నిరూపించిందన్నారు.  దమ్ము ధైర్యం ఉండి, గ్రేట్‌ సూపర్‌ హీరో​ లభిస్తే మధురై నిర్మాత అయినా నమ్మకంతో సినిమా తీస్తే చూడడానికి జనం ఉన్నారని  పేర్కొన్నారు. బాహుబలి ది బిగినింగ్  అనూహ్యంగా బాక్సాఫీస్   రికార్డులను బద్దలుకొట్టిందని,  ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.  ఈ చిత్రంలోని రెండు భాగాల నుంచి తాను  నేర్చుకున్న దాని ఆధారంగా  భవిష్యత్తులో పాత్రలను ఎంచుకుంటానని రానా చెప్పారు.
 
తమ ప్రతిష్టాత్మక చిత్రం భారతదేశ  సినీ  నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ,  భారీ చిత్రాలను నిర్మించే  లైసెన్స్‌ ఇచ్చిందని రానా చెప్పారు. మోహన్ లాల్  చేపట్టబోయే భారీ  బహుముఖ చిత్రం మహాభారత్‌  రూ. 1000 కోట్ల బడ్జెట్‌ సినిమాలకు బాహుబలి నాంది పలికిందా అని ప్రశ్నించినపుడు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మాతలు ఆవైపుగా ఆలోచించడం అద్భుతం మన్నారు.  ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments