Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి పునర్జన్మనిచ్చింది అంటున్న ఆ భాను ఎవరు? ఆ డూప్ ఇప్పుడు హీరోయిన్

బాహుబలి ది బిగినింగ్‌లో తమన్నా సరసన నెచ్చెలిగా రెండు మూడు సందర్భాల్లో మాత్రమే కనిపించి మాయమైపోయిన భానుశ్రీ పాత్రధారిణి మీకు గుర్తుందా? తొలి భాగంలో తమన్నాకు డూప్‌కా కూడా కీలకమైన సన్నివేశాల్లో నటించిన భాను ఇప్పుడు హీరోయిన్ అంటే నమ్మశక్యం కాదేమో..

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (08:07 IST)
బాహుబలి ది బిగినింగ్‌లో తమన్నా సరసన నెచ్చెలిగా రెండు మూడు సందర్భాల్లో మాత్రమే కనిపించి మాయమైపోయిన భానుశ్రీ పాత్రధారిణి మీకు గుర్తుందా? తొలి భాగంలో తమన్నాకు డూప్‌కా కూడా కీలకమైన సన్నివేశాల్లో నటించిన భాను ఇప్పుడు హీరోయిన్ అంటే నమ్మశక్యం కాదేమో.. సాధారణంగా చెలికత్తె, నెచ్చెలి, సహాయకురాలు వంటి పాత్రలు పోషించేవారిని ఎక్స్‌ట్రాలు అని సినీపరిశ్రమ తీసిపడేస్తుంది. కానీ బాహుబలి చిత్రం ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు ఆమెకు ప్రత్యేక అవకాశాలను కూడా అందించి హీరోయిన్ని చేసేశాయి. అందుకే టీవీ సీరియల్‌కి మాత్రమే పరిమితమై ఉన్న తనకు బాహుబలి పునర్జన్మ ఇచ్చిందని భాను కృతజ్ఞత ప్రకటిస్తున్నారు.
 
బాహుబలి బానుశ్రీ అసలు పేరు స్వప్న. వరంగల్‌లో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగి ఇంటర్మీడియట్ వరకు చదివిన  భానుశ్రీ అలియాస్ స్వప్న ఫిల్మ్ ఇండస్ట్రీపై ఫ్యాషన్‌తో చదువు ఆపి బుల్లితెర, తర్వాత వెండితెర వైపు నడిచివచ్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాబిలమ్మ టీవీ సీరియల్‌లో నటించిన స్వప్నకు తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో తమన్నా పక్కన సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా నటించే అవకాశం వచ్చింది. కత్తి ఫైట్స్‌ చేసే షాట్స్, పాటలో లాంగ్‌షాట్స్‌లో తమన్నాకు డూప్‌గా చేసింది. ఈ చిత్రంలో నటించినప్పుడు వరంగల్‌లో తనకు పెద్ద సన్మానం చేశారట. 
 
ప్రతి సన్నివేశాన్ని నటించి చూపించే రాజమౌళితో చాలాచాలా హ్యాపీగా పనిచేశానని చెపుతున్న భాను బాహుబలి చిత్రం నిజంగా తనకు పునర్జన్మ వంటిది అంటోంది. దురదృష్టవశాత్తూ బాహుబలి-2లో నటించే అవకాశం రాలేదు కానీ బాహుబలి భానుశ్రీ గుర్తింపు ఆమెకు అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. ‘కుమారి 21ఎఫ్‌’లో సెకండ్‌ లీడ్‌ రోల్‌ చేసింది. ‘ఆవు, పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్లి’ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేసింది. ప్రస్తుతం ‘ఇద్దరి మధ్య 18’ సినిమాలో  హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతోంది. తెలుపు రంగు అన్నా, తెలుగు అమ్మాయిగా పిలిపించుకోవడం అన్నా చాలా మక్కువ చూపే బాహుబలి భానుశ్రీ కెరీర్ సాఫీగానే సాగాలని ఆశిద్దాం.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments