Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 స్ఫూర్తితో అత్యంత భారీ చిత్రం 'కురుక్షేత్ర'కు సై అంటున్న కన్నడ నాడు

కర్నాటకలో, ప్రత్యేకించి బెంగళూరు మహానగరంలో బాహుబలి-2 చిత్రం సాధించిన రికార్డు కలెక్షన్ల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమ శాండల్ వుడ్‌పై పడింది. కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో అత్యంత భారీ చిత్రాన్ని నిర్మించడానికి కన్నడ చిత్ర పరిశ్రమ సిద్ధమవుతోంది. దర్శక ధీరు

Webdunia
బుధవారం, 17 మే 2017 (08:27 IST)
కర్నాటకలో, ప్రత్యేకించి బెంగళూరు మహానగరంలో బాహుబలి-2 చిత్రం సాధించిన రికార్డు కలెక్షన్ల ప్రభావం కన్నడ చిత్ర పరిశ్రమ శాండల్ వుడ్‌పై పడింది. కన్నడ సినీ పరిశ్రమ చరిత్రలో అత్యంత భారీ చిత్రాన్ని నిర్మించడానికి కన్నడ చిత్ర పరిశ్రమ సిద్ధమవుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి అద్భుత విజయం ప్రేరణగా ఒక కన్నడ చిత్ర నిర్మాత మహభారతం ఆధారంగా అత్యంత భారీ స్థాయిలో పౌరాణిక చిత్రాన్ని తీయడానికి పూనుకుంటున్నారు.
 
కన్నడ చిత్ర నిర్మాత, రాజకీయ నేత ఎన్ మునిరత్న కురుక్షేత్ర అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కౌరవ రాజు ధుర్యోధనుడు ఇతివృత్తంగా తీస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు విజువల్ ఎఫెక్టులు ప్రత్యేకమని చెప్పాల్సిన పని లేదు పౌరాణిక యుగంలోని యుద్ధ దృశ్యాలను అతి భారీగా తీయడానికి గ్రాఫిక్స్‌ను భారీ స్థాయిలో ఉపయోగించనున్నట్లు నిర్మాత తెలిపారు.  ఈ ఏడాది జూలై 23న ప్రారంభం కానున్న ఈ చిత్ర నిర్మాణం ఆరునెలల్లో పూర్తి చేసుకుని సంవత్సరం చివర్లో విడుదల చేస్తామని తెలిపారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ బాహుబలి-2 విజయం తనకు మార్గ దర్శనం చేసిందన్నారు. బెంగళూరు అతి పెద్ద కేంద్రం, కన్నడ చిత్రాలు కూడా ఈ నగరంలోని మార్కెట్ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోగలదు. ఈ శక్తిని ఉపయోగించే ఉద్దేశంతోనే కురుక్షేత్ర సినిమా తీస్తున్నాను అన్నారు. పలు కన్నడ సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన మునిరత్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. బాహుబలి-2 తొలి వారం చివరకే వెయ్యి కోట్ల వసూళ్లను సాదించగా బెంగళూరు షేర్ 300 కోట్ల మేరకు ఉందని చెబుతున్నారు. 
 
ఇంతవరకు కన్నడ సినిమాలపై భారీ పెట్టుబడులు అంటే నష్టంతో కూడిన వ్యవహారమని భావించేవారు. బాహుబలి-2 ఇచ్చిన స్ఫూర్తితో కర్నాటక కూడా భారీ చిత్రాల నిర్మాణానికి సాహసిస్తోంది. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments