Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2.. విదేశాల్లో కలెక్షన్ల రికార్డు అదిరింది.. నేటికి రూ.801 కోట్లు

తెలుగు సినిమాను ప్రపంచ సినిమాగా చేసిన బృహత్ సినిమా బాహుబలి. గత రెండున్నర నెలలుగా ఈ సినిమా రెండో భాగం బాహుబలి 2ని పొగడని వారు లేరు. బాలీవుడ్ రికార్డులను నేలకు దింపిన సినిమా మాత్రమే కాదు. పలు దేశాల్లో రికార్డులను కూడా సృష్టించిన బాహుబలి-2 విడుదలైన రెండ

Webdunia
గురువారం, 20 జులై 2017 (08:05 IST)
తెలుగు సినిమాను ప్రపంచ సినిమాగా చేసిన బృహత్ సినిమా బాహుబలి. గత రెండున్నర నెలలుగా ఈ సినిమా రెండో భాగం బాహుబలి 2ని పొగడని వారు లేరు. బాలీవుడ్ రికార్డులను నేలకు దింపిన సినిమా మాత్రమే కాదు. పలు దేశాల్లో రికార్డులను కూడా సృష్టించిన బాహుబలి-2 విడుదలైన రెండున్నర నెలల తర్వాత కూడా దేశంలో, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రదర్శింపబడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల బెంచ్ మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగానే కాదు ఇంతవరకు 1700 కోట్లు సంపాందించి చరిత్రకెక్కింది. ఇప్పుడు తాజాగా మరో రికార్డు బాహుబలి ఒడిలో చేరింది. బాహుబలి-2 విదేశాల్లో నేటివరకు రూ.801 కోట్లు వసూలు చేసినట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు.
 
బాహుబలి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. హాలీవుడ్‌ దర్శకులు సైతం సాహో అనే విధంగా బాహుబలిని రాజమౌళి తెరకెక్కించారు. అది సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రికార్డులు అన్నీ తిరగ రాసింది. ఇప్పడు ఏ రికార్డైనా నాన్‌-బాహుబలి రికార్డుగా చెప్పకుంటున్నారంటే అది సృష్టించిన సంచలనం అలాంటింది. దేశ విదేశాల్లో రికార్డులు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల బెంచ్ మార్కును దాటిన చిత్రంగా బాక్సాఫీసు వద్ద కొత్త ఫీట్‌ను సృష్టించింది. ఇప్పుడు తాజాగా మరో రికార్డు బాహుబలి ఒడిలో చేరింది.
 
బాక్సాఫీస్‌ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం బాహుబలి-2 విదేశాల్లో రూ.801 కోట్లు వసూలు చేసింది. ఇది ఏభారతీయ చిత్రం ఇప్పటివరకూ చేరుకోలేని రికార్డు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలో ఏర్పాటు చేసిన 39వ అంతర్జాతీయ సినీ ఫెస్టివల్‌లో మొదటిసారి ఇండియన్‌ పనోరమ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. బ్యాడ్‌మ్యాన్‌, ఎ డెత్‌ ఇన్‌ ద గంజ్‌, బేయార్‌, యూటర్న్‌, కోతనోడి చిత్రాలతోపాటు బాహుబలి సిరీస్‌ను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
 
బాహుబలి.. ప్రపంచ సినిమారంగంపై తెలుగు వారి చెరిగిపోని సంతకం. దాని ప్రతి విజయమూ అందరూ ఆస్వాదించదగినదే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments