'బాహుబలి 2' ట్రైలర్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఉదయం ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగాన్ని ఎక్కడైతే ముగించారో.. అక్కడి నుంచే మొదలు పెడుతూ రాజమౌళి ఈ ట్రైలర్
'బాహుబలి 2' ట్రైలర్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గురువారం ఉదయం ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగాన్ని ఎక్కడైతే ముగించారో.. అక్కడి నుంచే మొదలు పెడుతూ రాజమౌళి ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రాజ్యం.. అధికారం.. యుద్ధం.. ప్రేమ.. అంశాలను టచ్ చేస్తూ ఈ ట్రైలర్‌ను తయారు చేశారు.
ప్రధానపాత్రలన్నీ కనిపించేలా కట్ చేసిన ఈ ట్రైలర్‌లో ఎమోషన్స్ శాతం ఎక్కువగా కనిపిస్తోంది. భారీ సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్.. కెమెరా పనితనం చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ప్రభాస్.. రానా తలపడే షాట్ కూడా హైలైట్‌గా నిలుస్తోంది. ఈ ట్రైలర్‌తో అంచనాలను పెంచాలని ఈ సినిమా టీమ్ చేసిన ప్రయత్నం ఫలించిందని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
మరోవైపు... ఈ చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో.. చిత్ర ట్రైలర్‌పై కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే... ట్రైలర్ విడుదలైన జస్ట్ 4 గంటల్లోనే మిలియన్ వ్యూస్‌ను కుమ్మేసింది. సాధారణంగా ఏదేని ఒక చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యాక అది మిలియన్ వ్యూస్ చేరాలంటేనే దాదాపు ఆరు గంటల నుంచి ఒక రోజు దాకా పడుతుంది. కానీ, ఆ టైంను తలదన్నేలా 'బాహుబలి-ద కన్‌క్లూజన్' ట్రైలర్ తిరిగి రాయలేని రికార్డులను సృష్టించేసింది.
జస్ట్ ఈ ఐదు గంటల టైంలో రెండు మిలియన్ వ్యూస్‌ను దాటిపోయాడు బాహుబలి. ఇప్పటిదాకా 5,249,373 వ్యూస్ కొట్టేశాడు. అంటే సగటున గంటకు మిలియన్ వ్యూస్ చొప్పున కొట్టేశాడు. అలాగే, ఈ ట్రైలర్‌ను 285,413 మంది లైక్ చేయగా, 20,672 మంది డిస్‌లైక్ చేశారు. మరి, కొత్త.. కొత్త రికార్డులు రాస్తున్న బాహుబలి సినిమాను మరే సినిమా అయినా బీట్ చేయగలదేమో చూడాలి. ఇక, రెండు మిలియన్ వ్యూస్ దాటిపోవడాన్ని జక్కన్న ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘‘అందరికీ ‘మిలియన్’ ధన్యవాదాలు.. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది’’ అని ట్వీట్ చేశాడు.