Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 6న ప్రభాస్ 'బాహుబలి-2' టీజర్?

హీరో ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "బాహుబలి-2". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఎపుడెపుడు

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (15:02 IST)
హీరో ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "బాహుబలి-2". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఎపుడెపుడు రిలీజ్ అవుతుందా అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన విషయాలను బయటకు పొక్కకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
చిత్రాలకు సంబంధించిన విషయాలు.. ఫొటోలను అప్పుడప్పుడు చిత్ర యూనిట్ సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్‌లను వీడియోలో పొందుపరిచారు. 
 
అంతేగాకుండా అందులో ఇంటర్వ్యూ కూడా ఉంది. ఇదిలావుంటే అన్ని హంగులతో ట్రైలర్ విడుదల చేసేందుకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. మార్చి 6వ తేదీన 'బాహుబలి 2' టీజర్ విడుదల కానున్నట్లు వినిపిస్తోంది. మరి 'బాహుబలి 2' టీజర్ ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments