Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ మ్యాచ్‌లా బాహుబలి-2 తమిళ ఆడియో ఫంక్షన్.. ఆర్నాల్డ్, రజినీ వస్తున్నారా?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు నటించిన బాహుబలి-2 సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌‌లోనే భారీ హైప్‌ వచ్చేసింది. టీవీ హక్

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (16:11 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు నటించిన బాహుబలి-2 సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్‌‌లోనే భారీ హైప్‌ వచ్చేసింది. టీవీ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయి. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గురించి హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.

తెలుగు ఆడియో హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో మార్చి 26వ తేదీన జరుగనుండగా, తమిళ ఆడియో వేడుక చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. తమిళ బాహుబలి2 ఆడియో వేడుక మాత్రం క్రికెట్ మ్యాచ్‌లా జరుగనుందని కోలీవుడ్‌ వర్గాల టాక్. 
 
ఎలాగంటే..? అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరిగే చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక జరుగనుంది. ఇప్పటికే బాహుబలి 2 ట్రైలర్ కొత్త రికార్డులను లిఖించుకుంది. భారీ బడ్జెట్ మూవీగా వివిధ భాషల్లో రూపుదిద్దుకున్న బాహుబలి 2 ప్రమోషన్ కోసం సినీ యూనిట్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. 
 
ఈ క్రమంలో తెలుగు ఆడియో వేడుకలా తమిళ బాహుబలి ఆడియో వేడుక కూడా ఫ్యాన్స్ అంచనాలను మించి.. అట్టహాసంగా జరిపించాలని జక్కన్న టీమ్ భావిస్తోంది. ఈ వేడుకకు హాలీవుడ్ స్టార్లు సైతం హాజరవుతారని తెలిసింది. ఈ క్రమంలో హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాహుబలి-2 ఆడియో వేడుకలో హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపడం జరిగిందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments