Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవసేనది పవర్ ఫుల్ రోల్.. స్పీల్ బర్గ్.. బాహుబలి-2 సినిమాను చూడాలి..

రామోజీ ఫిల్మ్ సిటీలో ''బాహుబలి-2" ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హాజరయ్యారు. ‘బాహుబలి ది బిగినింగ్’ను ఆర్కా మీడియా పతాకంపై కరణ్ జోహార్ హిందీలో

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (10:07 IST)
రామోజీ ఫిల్మ్ సిటీలో ''బాహుబలి-2" ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హాజరయ్యారు. ‘బాహుబలి ది బిగినింగ్’ను ఆర్కా మీడియా పతాకంపై కరణ్ జోహార్ హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘బాహుబలి ద కన్‌క్లూజన్’ విడుదల బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. దీంతో అనుకున్నట్టుగానే కరణ్ జోహార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
 
ఈ ఫంక్షన్‌లో దేవసేన మాట్లాడుతూ.. బాహుబలి మూవీలో దేవసేన రోల్ మామూలు పాత్ర కాదని, చాలా పవర్‌పుల్ పాత్రని అని చెప్పింది. అతిపెద్ద ప్రాజెక్టు అయిన బాహుబలితో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. ఐదేళ్లలో ప్రతీ ఒక్కరూ మరొకరి నుంచి ఒక్కో అంశాన్ని నేర్చుకున్నారని తెలిపింది. తాను సినిమాల్లో రాణించడానికి తన కుటుంబ సభ్యుల పాత్ర, ప్రోత్సాహం మరువలేనిదని చెప్పింది. 
 
మరోవైపు భారత సినిమాలపా కామెంట్స్ చేసిన హాలీవుడ్ డైరక్టర్ స్పీల్‌బర్గ్ బాహుబలి సినిమా చూడాలని సూచించారు.. ప్రముఖ నటుడు కృష్ణంరాజు. బాహుబలి-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కృష్ణంరాజు మాట్లాడుతూ సంతోషంలో తనకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదన్నారు. 
 
రాజమౌళి తండ్రి ప్రసాద్‌ తనకు మంచి స్నేహితులని.. ఆయన కుటుంబసభ్యులందరూ తనకు తెలుసునని చెప్పారు. బాహుబలి మూవీని చూసి కామెంట్ చేయండని స్పీల్‌బర్గ్‌కు కృష్ణంరాజు సూచించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments