Webdunia - Bharat's app for daily news and videos

Install App

'థ్యాంక్స్ డార్లింగ్స్'... ఇకపై యేడాదికి రెండు సినిమాలు చేస్తా : హీరో ప్రభాస్

'థ్యాంక్స్... డార్లింగ్స్' అంటూ హీరో ప్రభాస్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 'బాహుబలి ది కన్ క్లూజన్' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అభిమానులకు… సినిమా యూనిట్‌కు ధన్యవాదాలు మాట్లాడారు. అభిమానుల కోసం ఇకపై ఏడాదికి ర

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (09:37 IST)
'థ్యాంక్స్... డార్లింగ్స్' అంటూ హీరో ప్రభాస్ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 'బాహుబలి ది కన్ క్లూజన్' ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో అభిమానులకు… సినిమా యూనిట్‌కు ధన్యవాదాలు మాట్లాడారు. అభిమానుల కోసం ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని అన్నాడు. చాలా ఆలస్యమైంది, జాగ్రత్తగా వెళ్లండి అని అభిమానులకు సూచించాడు. సినిమాలో చాలా అంశాలు ఉన్నాయని, వాటిని చూసి ఆనందించండి అంటూ కోరాడు. 
 
ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు రెండు డైలాగులు చెప్పాడు. 'నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా' అంటూ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాడు. 'వాడు తప్పు చేశాడు, వాడి తలతెగింది' అంటూ మరో డైలాగును కూడా చెప్పడంతో వేదిక ప్రభాస్ నినాదాలతో మార్మోగి పోయింది. 
 
అలాగే, తన పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు వేదిక ఎక్కేందుకు వెళ్లగా... ఆయనను వేదిక ఎక్కించేందుకు ప్రభాసే స్వయంగా తోడుగా వెళ్లాడు. ప్రభాస్ భుజం పట్టుకుని కృష్ణంరాజు వేదిక ఎక్కారు. వేదిక ఎక్కిన అనంతరం తన స్పీచ్ ముగించి వెనుదిరగగానే స్టేజ్ మీదకు వెళ్లిన ప్రభాస్ మళ్లీ ఆయనకు ఊతంగా నిలబడి వేదిక దించాడు. ఇది అక్కడున్న అభిమానులందర్నీ ఆకట్టుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments