Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్సీస్ మార్కెట్‌ను షేక్ చేస్తున్న బాహుబలి-2.. పీకే, దంగల్‌ రికార్డులు బ్రేక్

ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్‌లను బాహుబలి అవలీలగా కేవలం 5 రోజుల్లో చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్‌లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియ

Webdunia
బుధవారం, 3 మే 2017 (04:28 IST)
ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్‌లను బాహుబలి అవలీలగా కేవలం 5 రోజుల్లో చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్‌లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు బాహుబలి2 నిజంగానే చెమటలు పట్టిస్తోంది. 
 
ఇక ఓవర్‌సీస్‌లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్‌సీస్‌లో 10.56 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే పీకే రికార్డును సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డును బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డులను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డులను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
 
అంతేకాదు ఫుల్ రన్‌లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్కును సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్సీస్‌లో ఇంకెన్నీ రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సిందే మరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments