Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా కాలు జారాడా? బాహుబలి 3లో తెలుస్తుందా?

సినిమాల్లో కొన్నింటికి జవాబులుండవు. చూసి ఆనందించాల్సిందే తప్పితే ఎలా జరిగింది... అదెట్లా ఇదెట్లా అంటే కుదరదు. ఏనుగు ధనుస్సును గట్టిగా లాగిపెడితే బాణం వేయడం జరిగిందా అని అడిగితే... జరుగుద్ది అదంతే... ఎంతో పెద్ద లోయలో జలపాతం పడుతుంటే అక్కడి నుంచి ఆకాశా

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (15:18 IST)
సినిమాల్లో కొన్నింటికి జవాబులుండవు. చూసి ఆనందించాల్సిందే తప్పితే ఎలా జరిగింది... అదెట్లా ఇదెట్లా అంటే కుదరదు. ఏనుగు ధనుస్సును గట్టిగా లాగిపెడితే బాణం వేయడం జరిగిందా అని అడిగితే... జరుగుద్ది అదంతే... ఎంతో పెద్ద లోయలో జలపాతం పడుతుంటే అక్కడి నుంచి ఆకాశాన్ని చూసే నున్నటి కొండను ప్రభాస్ ఎలా ఎక్కాడు అంటే ఎక్కగలడంతే... ఇలా సినిమాలో ఎన్నో అద్భుతాలు అవలీలగా జరిగిపోతుంటాయి. బాహుబలి బిగినింగ్ చిత్రం తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ మొన్నటివరకూ ఒకటే ప్రశ్నపై చర్చ జరిగింది. 
 
ఇప్పుడు కొత్తగా మరో ప్రశ్నపై చర్చ జరుగుతోంది. అదేమిటంటే... బాహుబలి ది బిగెనింగ్‌లో అమరేంద్ర బాహుబలి కుమారుడు శివుడు, దేవసేనను రాజకోట నుంచి తప్పించి తీసుకొస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన భల్లాల దేవుడి కుమారుడు భద్రుడిని నరికి హతమారుస్తాడు. దాంతో శివుడు ఎవరో తెలిసిపోతుంది. ఐతే బాహుబలి-2 కన్‌క్లూజన్‌‍లో భల్లాల దేవుడు(రానా)కు పెళ్లయినట్లు చూపించలేదు.
 
కేవలం అమరేంద్ర బాహుబలి, ప్రేమ, మాహిష్మతి రాజ్యం చుట్టూ కథ తిరుగుతుంది. మరి భల్లాల దేవుడికి పెళ్లి కాకుండానే కొడుకు ఎలా పుట్టాడన్నది ఇప్పుడు ప్రశ్న. భల్లాల దేవుడు ఏమయినా అంతఃపురం కాంతతో రహస్య జీవితం గడిపాడా, అలా కాలు జారడం వల్ల భద్రుడు పుట్టాడా...? ఇలా చర్చ స్టార్టయింది. మరి దీన్ని జస్ట్ మాట్లాడుకుని వదిలేస్తారో లేదంటే మళ్లీ బాహుబలి 3 అంటారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments