Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2: విడుదలకు ముందే రికార్డ్.. రూ.500 కోట్ల బిజినెస్ అయ్యిందట..

ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బాహుబలి 2 బిజినెస్‌ అమాంతం పెరిగిపోతోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్ద

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:18 IST)
ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బాహుబలి 2 బిజినెస్‌ అమాంతం పెరిగిపోతోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి 2' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. 
 
కేవలం డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా రూ.500 రాబట్టినట్లు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్వీట్ చేశారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. 'బాహుబలి'కి కొనసాగింపుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. బాహుబలి ద  బిగినింగ్ సినిమా దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమాలోనే రికార్డులతో చరిత్ర సృష్టించింది. తద్వారా 2015లో భారత్‌లో అత్యధికంగా కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బాహుబలి 2' (ద ఎండింగ్) ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ససోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments