Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తలైవా' ట్వీట్‌కు ఉబ్బితబ్బిబ్బులైన రాజమౌళి... దేవుడే స్వయంగా ఆశీర్వదించినట్టుగా ఉందంటూ రీట్వీట్

ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న 'బాహుబలి-2' చిత్రానికి తలైవా, దక్షిణాది ప్రముఖ నటుడు రజినీకాంత్‌ రివ్యూ ఇచ్చారు. భారతదేశం ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేంత గొప్ప చిత్రం 'బాహుబలి -2' అన్నార

Webdunia
సోమవారం, 1 మే 2017 (12:12 IST)
ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న 'బాహుబలి-2' చిత్రానికి తలైవా, దక్షిణాది ప్రముఖ నటుడు రజినీకాంత్‌ రివ్యూ ఇచ్చారు. భారతదేశం ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేంత గొప్ప చిత్రం 'బాహుబలి -2' అన్నారు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సినిమాను చూసిన ఆయన దర్శక ధీరుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. ‘భారతీయ సినిమాకు 'బాహుబలి-2' గర్వకారణం. రాజమౌళి దేవుడిచ్చిన వరం అంటూ తలైవా ట్వీట్ చేశారు. 
 
దీనికి దర్శకదిగ్గజం ఎస్ఎస్.రాజమౌళి రీ ట్వీట్ చేశారు. "తలైవా... నన్ను దేవుడే స్వయంగా ఆశీర్వదించినట్టుగా ఉంది. మా టీమంతా ఇప్పుడు ఆనందంలో తేలియాడుతోంది. మరే అభినందనా ఇంతకంటే గొప్పగా ఉండబోదు" అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీలను ఉంచారు. ఆపై ప్రియాంకాచోప్రా పంపిన అభినందనలపై కూడా రాజమౌళి స్పందించారు. "చాలా కృతజ్ఞతలు ప్రియాంకా... నువ్వీ చిత్రాన్ని చూసి ఆనందించినందుకు ఆనందం" అని అన్నారు. 
 
కాగా, శుక్రవారం విడుదలైన 'బాహుబలి 2' చిత్రం రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం విడుదలైన తొలి రోజే రూ.121కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసింది. హిందీ వెర్షన్‌లో కూడా విడుదలై దాదాపు రూ.40కోట్లను వసూలు చేసి అమీర్‌ ఖాన్‌ 'దంగల్‌' చిత్రం ఓపెనింగ్‌ డే రికార్డును కూడా తుడిచిపారేసింది. ప్రస్తుతం మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టే దిశగా బాహుబలి-2 దూసుకెళుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments